English   

కంగనా రనౌత్ పై బ్రోకరేజ్ కేస్

Complaint against Kangana Ranaut on Real Estate Controversy
2018-08-20 14:21:01

కాంట్రవర్శీస్ లో రామ్ గోపాల్ వర్మకు ఫీమేల్ రూపం అంటే కంగనా రనౌత్ అనే అంటారు. తను చెప్పే విషయాలన్నీ ముక్కుసూటిగా ఉండటం.. కొందర్ని డైరెక్ట్ గా టార్గెట్ చేయడంతో పాటు ఏదైనా కుండ బద్ధలు కొట్టినట్టు మాట్లాడటం వల్ల.. అవి నచ్చని కొందరు ఆ మాటలతో రాద్ధాంతం చేస్తారనే కామెంటూ ఉంది. మొత్తంగా హాట్ హాట్ గా కనిపించడంతో పాటు హృతిక్ రోషన్ తో గొడవ విషయంలోనూ చాలాకాలంగా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన వివాదాస్పద పేజ్ క్రియేట్ చేసుకున్న ఈ క్వీన్ కు ఎన్ని గొడవలున్నా.. సినిమా ఆఫర్స్ మాత్రం తగ్గడం లేదు. అది కొంత ఆశ్చర్యం కలిగించినా అమ్మడి టాలెంట్ రేంజ్ అది అని అర్థం చేసుకోవాల్సిందే.

ప్రస్తుతం క్రిష్ డైరక్షన్ లో ‘మణికర్ణిక’ అనే హిస్టారికల్ సినిమాలో నటిస్తోంది. మరోవైపు దీనికి పూర్తి భిన్నంగా అత్యంత హాట్ గా ‘మెంటల్ హై క్యా’ అనే సినిమాలో రాజ్ కుమార్ రావుతో కలిసి నటిస్తోంది. సినిమాల మేటర్ పక్కన బెడితే లేటెస్ట్ గా అమ్మడిపై ఓ వ్యక్తి కేస్ పెట్టాడు. కాస్త సిల్లీగా ఉన్న ఆ కేస్ ను పోలీస్ లు నమోదు చేసుకోవడం విశేషం. 
ఈ మధ్యే ముంబైలోని పాలీహిల్ లో ఓ ఇల్లు కొన్నది. 20కోట్లకు పైనే వాల్యూ ఉన్న ఆ ఇంటిని ఓ బ్రోకర్ ద్వారా కొనుగోలు చేసింది కంగనా. అతని పేరు ప్రకాష్ రోహిర్.. అయితే తనకు రావాల్సిన బ్రోకరేజ్ చెల్లించలేదని కేస్ పెట్టాడా వ్యక్తి.

దీంతో పోలీస్ లు కంగనపై కేస్ నమోదు చేసుకున్నారు. అయితే ఈ విషయంపై కంగన వెర్షన్ వేరే ఉంది. తను అతనికి న్యాయంగా ఇస్తానన్న ఒన్ పర్సెంట్ (20లక్షలు)ఇచ్చానని.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా తన వద్ద ఉన్నాయని అంటోంది. కానీ అతను ఇప్పుడు 2పర్సెంట్ డిమాండ్ చేస్తున్నాడని.. తాను ఇవ్వను అని చెప్పడంతో ఇలా కేస్ పెట్టి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు అంటోంది. మరి ఈ గొడవ ఎటు తేలుతుందో చూడాలి.

More Related Stories