English   

ఆర్ఆర్ఆర్ సినిమాపై ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర ట్వీట్

RRR
2020-10-23 10:45:41

దర్శకధీరుడు రాజమౌళి  తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ సినిమా "ఆర్ఆర్ఆర్". ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. కొంతవరకు సినిమా షూటింగ్ ను పూర్తి చేయగా మధ్యలో కరోనా రావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే లాక్ డౌన్ కి ముందు రాంచరణ్ కుబసంబందించిన టీజర్ ను షూట్ చేయడంతో చరణ్ బర్త్ డే సంధర్బంగా జక్కన్న దానిని విడుదల చేసి చరణ్ ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చారు. కాగా లాక్ డౌన్ కారణంగా ఎన్టీఆర్ బర్త్ డే వరకు అతడి టీజర్ ను షూట్ చేయలేదు. దాంతో కొమురంభీమ్ జయంతి సందర్భంగా జక్కన్న ఎన్టీఆర్ టీజర్ ను వదిలారు. ఇక టీజర్ వచ్చిన గంటల్లోనే వ్యూవ్స్ ఒక రేంజ్ లో వచ్చాయి. కాగా తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆర్ఆర్ఆర్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. "మన్యం ముద్దు బిడ్డ. మా అన్న. మా ఆదర్శం కొమురంభీమ్ జయంతి సందర్భంగా నా ఘన నివాళులు. మా వీరుడు మన్యం పులి కొమురంభీమ్ గారి స్పూర్తితో తీస్తున్న చిత్ర యూనిట్ కి నా అభినందనలు" అంటూ సీతక్క ట్వీట్ లో పేర్కొన్నారు.

More Related Stories