English   

శ్రీ‌రెడ్డి అరెస్ట్ అయిందా..?

Sri Reddy Mallidi Started Tamil Leaks

ఇప్పుడు ఇండ‌స్ట్రీతో పాటు బ‌య‌ట కూడా బాగా న‌డుస్తున్న చ‌ర్చ ఇదే. ఎందుకంటే తెలుగు ఇండ‌స్ట్రీపై ఇన్నాళ్లూ ఎన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసినా కూడా ఈమె జైలుకు వెళ్ల‌లేదు.. అరెస్ట్ అయితే కాలేదు. ఆడ‌పిల్ల ఆవేద‌న అంటూ మ‌నోళ్లు వ‌దిలేసారు.. లైట్ తీసుకున్నారు. శ్రీ‌రెడ్డి హ‌ద్దులు దాటినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఆమెపై సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకున్న‌ది అయితే లేదు. కానీ ఈ మ‌ధ్యే చెన్నై వెళ్లి అక్క‌డి హీరోల‌పై.. అక్క‌డి ఇండ‌స్ట్రీపై ఇష్టం వ‌చ్చిన‌ట్లు నోరు పారేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. దాంతో ఆమెను అక్క‌డ అరెస్ట్ చేసార‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. ముఖ్యంగా కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్ లో శ్రీ‌రెడ్డి అరెస్ట్ అంటూ న్యూస్ వ‌చ్చింది.

ఇది చివ‌రికి శ్రీ‌రెడ్డి వ‌ర‌కు వెళ్ల‌డంతో ఫేస్ బుక్ లో ఆమె సీరియ‌స్ గా రియాక్ట్ అయింది. త‌న‌పై డ‌బ్బు సంపాదించుకుంటున్న వాళ్లే వ్యభిచారులు అని.. తాను ఆ జాతి కాద‌ని.. త‌న‌పై సిగ్గు లేకుండా ఉన్న‌ది లేనిది రాస్తూ కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్ నోటికి వ‌చ్చింది రాస్తున్నార‌ని మండిప‌డింది. ఘాటుగా కొన్ని విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు బూతులు కూడా వాడేసింది ఈ ముద్దుగుమ్మ‌. తానేమీ వ్య‌భిచారం చేయ‌లేద‌ని.. తానెవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని.. ఇంకా చెప్పాలంటే త‌న ద‌గ్గ‌ర ప‌డుకున్న త‌ర్వాత ఎవ‌డూ డ‌బ్బులు కూడా ఇవ్వ‌లేద‌ని చెప్పింది శ్రీ‌రెడ్డి. ఇండ‌స్ట్రీలో వ్య‌భిచారిణిల కంటే మ‌గ వ్య‌భిచారులే ఎక్కువ‌గా ఉన్నార‌ని ఘాటు కామెంట్స్ చేసింది శ్రీ‌రెడ్డి. నిజాలు తెలుసు కోకుండా రాస్తున్న యూ ట్యూబ్ ఛానెల్స్ కు ఆర్ఐపి అని పెట్టింది ఈ భామ‌. నిజానికి శ్రీరెడ్డి చెన్నైలో మకాం వేసింది. అందుకే ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు.

More Related Stories