English   

జబర్దస్త్ కామెడీ షో కు కరోనా వైరస్ భయం..

Jabardasth
2020-07-14 08:28:30

మూడు నెలల విరామం తర్వాత ఈ మధ్య జబర్దస్త్ కామెడీ షో మొదలైంది. గత మూడు వారాల నుంచి కొత్త ఎపిసోడ్స్ వస్తున్నాయి. వాటికి టిఆర్పి రేటింగ్ కూడా అదిరిపోతున్నాయి. చాలా రోజుల తర్వాత అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ రావడంతో ప్రేక్షకులు కూడా టీవీల ముందు అతుక్కుపోయారు. ఇలాంటి సమయంలో జబర్దస్త్ కమెడియన్ లకు కరోనా వైరస్ భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెరపై చాలా కరోనా కేసులు వచ్చాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా రోజుకు కనీసం ఒక పాజిటివ్ కేసు వస్తుంది. దాంతో జబర్దస్త్ కమెడియన్ లు కూడా వణికిపోతున్నారు. టెలివిజన్ నటులలో ఇప్పటికే దాదాపు పది మందికి కరోనా సోకింది. దాంతో మిగిలిన వాళ్ళందరూ షూటింగులకు ప్యాకప్ చెప్పి ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ జబర్దస్త్ కామెడీ షో మాత్రం యధావిధిగా నడుస్తుంది. 

పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం ఒక్కొక్కరికి చాలా భయం ఉందని షూటింగ్ చేయడానికి కూడా వణికిపోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. కాకపోతే షూటింగ్ లేకపోతే డబ్బులు రావు.. పారితోషకం లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకొని జబర్దస్త్ షోకి వస్తున్నారు కమెడియన్లు. మరోవైపు అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ నుంచి నానక్ రామ్ గూడా రామానాయుడు స్టూడియోకి జబర్దస్త్ సెట్ అంతా మార్చారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కానీ షూటింగ్ మొదలు పెట్టడం లేదు మల్లెమాల యాజమాన్యం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏ ఒక్కరికీ పాజిటివ్ వచ్చినా కూడా వెంటనే షో మళ్లీ ఆగిపోయే ప్రమాదం ఉంది. మొత్తానికి జబర్దస్త్ కమెడియన్ల పరిస్థితి ప్రస్తుతం దినదినగండంగా నడుస్తుంది.  

More Related Stories