English   

కరోనా కల్లోలం...టాలీవుడ్ థియేటర్లు బంద్ 

Telugu Cinema Theatres
2021-04-20 18:34:54

తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపింది. కొత్త కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి దృష్ట్యా జనసంచారం తగ్గించేందుకు  తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూను  అమ‌ల్లోకి తీసుకు వచ్చింది. 

ఇక తాజాగా మంగళవారం సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగింది. వకీల్‌ సాబ్‌ సినిమా ప్రదర్శించే థియేటర్లు మినహా మిగితా వాటిని మూసివేయాలని సమావేశంలో నిర్ణయించారు. కరోనా ఉధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లు థియేటర్ల నిర్వాహకులు తెలిపారు.

ఇక కరోనా కారణంగా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నానా అవస్థలు పడుతోంది. ఎప్పుడో విడుదలకావాల్సిన సినిమాలు ఇంకా విడుదలవ్వక.. బాక్సుల్లో అలాగే మూలుగుతున్నాయి. మరోవైపు గత లాక్ డౌన్ కారణంగా ఓ ఎనిమిది నెలలు షూటింగ్‌లన్ని బంద్ అయ్యి ఖాలీగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే కాస్తా కుదురుకుని సినిమాలు షూటింగ్‌లు జరుపుకోవడం.. దాంతో పాటు ఇప్పటికే రెడీగా ఉన్న సినిమాలు విడుదలవ్వుతున్నాయి.. అంతేకాకుండా క్రాక్, జాతిరత్నాలు, ఉప్పెన లాంటీ సినిమాలు మంచి ఫలితాలను అందుకుంటున్న వేళా మరోసారి థియేటర్స్ మూసివేయడం అంటే వణికిపోతున్నారు నిర్మాతలు.

More Related Stories