English   

టాలీవుడ్‌ హీరో పెళ్లిలో కరోనా టెన్షన్...టెస్ట్ లకి క్యూ 

 tollywood
2020-08-08 09:13:38

కరోనా రచ్చ మామూలుగా లేదు. మార్చి నెలలో గట్టిగా మొదలయిన ఈ కేసులు ఇప్పుడు ఇంకా విస్తృతం అయ్యాయి. అయితే ఈ లాక్ డౌన్ లో చాలా మంది టాలీవుడ్ వారు పెళ్ళిళ్ళకు రెడీ అయ్యారు. చాలా మంది కుర్ర హీరోలు ఆ బాట పట్టారు. అయితే ఈ మధ్య పలుసార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఆ యువహీరో వివాహాం అట్టహాసంగా జరిగింది. ఆ పెళ్లికి ఆ హీరోకు అత్యంత సన్నిహితులైన పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఆ పెళ్లికి హాజరయ్యారు. చాల రోజుల తరువాత ఆ హీరో మంచి హిట్ కూడా కొట్టడంతో ఆ హీరోతో ఇప్పటికే డేట్స్‌ కుదుర్చుకున్న నిర్మాతలు, దర్శకులు కూడా పెళ్లి వద్ద సందడి చేశారు. ఆ పెళ్ళికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పిక్స్ ప్రకారం ఆ పెళిలో ఎవరూ కూడా మాస్క్‌ ధరించి కనిపించలేదు. అయితే ఫోటోల కోసం ఫోజులు ఇవ్వడానికి పక్కన పెట్టారు అనుకుంటే అది నిజం కాదట. వారు పెళ్లి మొత్తం మాస్కులు దరించలేదట. అయితే ఆ పెళ్లికి హాజరైన పలువురు ఇప్పుడు కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. దీంతో ఆ వివాహానికి హాజరైన మిగతా వారిలో కూడా కంగారు మొదలైందని అంటున్నారు. ఈ దెబ్బకు అందరూ టెస్టులకు క్యూ కడుతున్నట్టు చెబుతున్నారు.  

More Related Stories