English   

స‌ల్మాన్ కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

Court’s permission needed every time while Salman travels abroad
2018-08-04 22:18:01

స‌ల్మాన్ ఖాన్ స్టార్ హీరో అయ్యుండొచ్చు.. ఇండియాలో ఇత‌డికి ఎదురే లేక‌పోవ‌చ్చు కానీ కోర్ట్ ముందు.. న్యాయం ముందు ఎవ‌రైనా ఒక్క‌టే. ఈయ‌న ఇప్పుడు దోషి. 20 ఏళ్ల కింద కృష్ణ‌జింకల‌ను వేటాడిన కేస్ లో ఈయ‌న దోషి. కోర్ట్ ఈయ‌న‌కు 5 ఏళ్ల శిక్ష కూడా విధించింది. అయితే బెయిల్ పై బ‌య‌ట ఉన్నాడు. జోధ్ పూర్ కోర్ట్ ఇప్ప‌టికీ స‌ల్మాన్ ను దోషీలాగే ట్రీట్ చేస్తుంది కూడా. ఈయ‌న కోర్ట్ అనుమ‌తి లేకుండా దేశం దాటి వెళ్ల‌కూడ‌ద‌నేది కండీష‌న్. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. స‌ల్మాన్ నిత్యం సినిమాల‌తో బిజీగా ఉంటాడు. ఈయ‌న సినిమాల్లో చాలా వ‌ర‌కు ఫారెన్ షెడ్యూల్స్ కూడా ఉంటాయి. ఇదే ఇప్పుడు స‌ల్మాన్ కు ఇబ్బందిగా మారింది. త‌న అనుమ‌తి లేకుండా దేశం దాటి వెళ్తే మ‌రిన్ని ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే స‌ల్మాన్ కు కోర్ట్ నుంచి వార్నింగ్ కూడా వ‌చ్చింది. వేరే దేశం వెళ్ళాలి అంటే కోర్టు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని జోధ్ పూర్ కోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది.

More Related Stories