అమీ జాక్సన్ కొడుకును చూసారా.. బుడ్డోడు ఎంత ముద్దొస్తున్నాడో..

అమీ జాక్సన్.. ఈ పేరుకు తెలుగులోనే కాదు ఇండియాలోనే మంచి ఇమేజ్ ఉంది. నటించింది తక్కువ సినిమాలే అయినా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది అమీ. ఫారెన్ నుంచి ఇండియాకు వచ్చి రజినీకాంత్, విక్రమ్, రామ్ చరణ్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో నటించింద. మన దేశం కాదు.. మన రాష్ట్రం కాదు.. ఎక్కడో లండన్ నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేసింది అమీజాక్సన్. అదృష్టం బాగుండి సూపర్ స్టార్స్ కూడా పిలిచి ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే విక్రమ్, అక్షయ్ కుమార్, చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. 2.0లో ఏకంగా రజినీకాంత్ తో కూడా జోడీ కట్టింది. ప్రతీ సినిమాలోనూ అందాలతో కుర్రాళ్ల నిద్ర పాడు చేస్తుంది. అమీజాక్సన్ కు సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ బాగానే డిమాండ్ ఉంది. అయితే కొన్నేళ్లుగా ఇండియన్ సినిమాలు చేయడం పూర్తిగా మానేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె తన కొడుకుతో బిజీగా మారిపోయింది. అప్పుడెప్పుడో ప్రగ్నెంట్ ఉన్నపుడు వరసగా పోస్టులు పెట్టింది అమీ. తనకు కచ్చితంగా కొడుకు పుడతాడంటూ చెప్పింది.
ఆమె నమ్మకమే నిజమై కొడుకు పుట్టాడు.. వాన్ని చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది. ముట్టుకుంటే మాసిపోయే అందం అంటారు కదా అలా ఉన్నాడు అమీ వారసుడు. పెళ్లి కాకుండానే తల్లి అయింది అమీ. తన బాయ్ ఫ్రెండ్ తోనే కలిసి సహజీవనం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఆయన పేరు జార్జ్. గతేడాది ఇతడితో అమీ ఎంగేజ్మెంట్ అయింది. ఆ ఫోటోను కూడా ఇన్స్టాగ్రామ్లో అప్పట్లో పోస్ట్ చేసింది అమీ. దాంతో పాటు 2019 అక్టోబర్ లో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది అమీ. జార్జ్ బ్రిటన్ కు చెందిన ఓ కుబేరుడు.. హిల్టన్, పార్క్ ప్లాజా, డబుల్ ట్రీ లాంటి లగ్జరీ హోటల్స్ ను నిర్వహిస్తున్నాడు జార్జ్. ఈయన ప్రేమలోనే కొన్నేళ్లుగా ఉంది అమీ. ఇప్పుడు ఈ ఇద్దరూ ముగ్గురు అయ్యారు. తన కుటుంబంతో హాయిగా ఎంజాయ్ చేస్తున్న అమీ జాక్సన్.. ఈ మధ్యే సూపర్ గాళ్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. మళ్లీ ఇండియాకు వచ్చే ఉద్దేశ్యం కానీ.. ఇక్కడి సినిమాలు చేసే ఆలోచన గానీ లేదని ఇదివరకే కన్ఫర్మ్ చేసింది అమీ.