English   

వర్మ మీద మరో కేసు...ఈ సారి మార్ఫింగ్ అంటూ పాల్ కోడలు !

paul
2019-12-10 18:37:39

ఏపీ లో మొన్న జరిగిన ఎన్నికల వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్  వర్మ ‘అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు’ పేరుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద సినిమాలో తన పాత్రను వాడారంటూ సినిమా మీద కేఏ పాల్ విడుదల చేయొద్దంటూ కోర్టులో పిటిష‌న్ కూడా వేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. ఈ  మూవీకి సెన్సార్ క్లియరెన్స్ లభించింది. ఈ విషయాన్ని కవితాత్మకంగా చెప్పడమే కాక మీలాంటి వాళ్ళు ఎవరెన్ని కేసులు పెట్టినా తన సినిమా ఆగదని చెబుతూ వర్మ సెన్సార్ సర్టిఫికేట్‌‌ను కేఏ పాల్ చేతుల మీదుగా అందుకుంటున్నట్లు ఓ మార్ఫింగ్‌ ఫోటోను తన ట్విటర్‌లో షేర్‌ చేశారు.

ఈ క్రమంలో వర్మపై కేఏపాల్ కోడలు బెగాల్ జ్యోతి సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ప్రమోషన్ కు తమ ఫోటోలను ఆర్జీవి మార్ఫింగ్ చేసి వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్న జ్యోతి, గతంలో తాము మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, అందుకే ఆర్జీవీ మీద చర్యలు తీసుకుని ఆ ఫోటోలను తొలగించాలని కోరింది. ఐపీసీ 469 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు వర్మ ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఐపీ నెంబర్ కోసం అన్వేషిస్తున్నారు. అలాగే ఐపీ నెంబర్ కోసం గూగుల్ సంస్థకు పోలీసులు లేఖ కూడా రాశారు.  

 

More Related Stories