English   

పెళ్లిసంద‌Dలోని ప్రేమంటే ఏంటి  లిరిక‌ల్ సాంగ్‌ రిలీజ్ 

PremanteEnti
2021-04-28 18:49:30

పాతికేళ్లుగా `పెళ్లిసంద‌డి` పాట‌లు అంద‌రినీ అల‌రిస్తున్నాయి. మ‌ళ్లీ ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు, స్వ‌ర‌వాణి కీర‌వాణి కాంబినేష‌న్‌లో కొత్త `పెళ్లిసంద‌D` తొలిపాట` ప్రేమంటే ఏంటీ..` ఈ రోజు విడుద‌లై శ్రోత‌ల్ని ఆక‌ట్టుకుంటోంది. రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందిస్తున్న చిత్రం `పెళ్లిసంద‌D`. గౌరి రోనంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని నిర్మాత‌లు. దాదాపుగా షూటింగ్ పూర్తిచేసుకున్న‌ ఈ చిత్రం నుండి ఫ‌స్ట్ సోల్‌ఫుల్‌ సాంగ్ `ప్రేమంటే ఏంటీ`ని ఈ రోజు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.

`నువ్వంటే నాకు ధైర్యం నీనంటే నీకు స‌ర్వం..నీకు నాకు ప్రేమా...ప్రేమంటే ఏంటీ..చ‌ల్ల‌గా అల్లుకుంట‌ది  మెళ్లగా గిల్లుతుంట‌ది. వెళ్ల‌నే వెళ్ల‌నంట‌ది విడిపోనంటుంది..మ‌రి నువ్వంటే నాకు ప్రాణం నేనంటే నీకు లోకం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి...``అంటూ ఆహ్లాద‌క‌రంగా సాగే ఈ పాట‌కు స్వ‌ర‌వాణి కీర‌వాణి క్యాచీ ట్యూన్‌ ఇవ్వ‌గా స్టార్ లిరిసిస్ట్‌ చంద్ర‌బోస్ అద్భుత‌మైన‌ సాహిత్యం అందించారు. హ‌రిచ‌రణ్‌, శ్వేత పండిట్ శ్రావ్యంగా ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. రొమాంటిక్ మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న‌`పెళ్లిసంద‌D` చిత్రంలోని `ప్రేమంటే ఏంటి` పాట‌తో  కె. రాఘ‌వేంద్ర‌రావు, కీర‌వాణిల పాట‌ల సంద‌డి మ‌ళ్లీ మొద‌లైంది. ఈ సినిమాలోని పాట‌లు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల‌వుతున్నాయి.

More Related Stories