English   

దగ్గుబాటి అభిరామ్ లాంచింగ్ కు ప్రయత్నాలు..డైరెక్టర్ ఎవరంటే

Daggubati abhiram
2021-03-03 15:16:33

దగ్గుబాటి సురేష్ బాబు కుమారులలో పెద్ద కుమారుడు రానా లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తరవాత టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.  ఇక ఇప్పుడు రానా తమ్ముడు అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీకి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి అభిరామ్ ను ఎప్పటినుండో లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో ప్రముఖ దర్శకుడు వంశీ చేతుల మీదుగా అభిరామ్ ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తరవాత పెళ్లి చూపులు సినిమాతో హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్ తో అభిరామ్ ఎంట్రీ ఉంటుందని వార్తలు వచ్చాయి. 

ఈ క్రమంలో మరోసారి అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీ పై గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి విభిన్న కథలతో అలరించే దర్శకుడు రవిబాబు చేతుల మీదుగా అభిరామ్ ఎంట్రీ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. రవి బాబు అల్లరి సినిమాతో నరేష్ ని ఇంట్రడ్యూస్ చేసాడు. ఆ తరవాత ఎన్నో డిఫరెంట్ సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అభిరామ్ కోసం కూడా రవిబాబు ఒక డిఫరెంట్ కథను రెడీ చేశారట. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారట. అయితే ఇవన్నీ గుసగుసలు మాత్రమే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

More Related Stories