English   

దగ్గుబాటి ఫ్యామిలీ కోటి విరాళం.. కాస్త ఆలస్యంగా.. 

 Daggubati
2020-03-28 14:43:11

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎలాంటి దారుణాలు చేస్తుందో కళ్లారా చూస్తూనే ఉన్నాం. దాని బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు.. మరెంతో మంది తిండి లేకుండా చచ్చిపోతున్నారు. కరోనా చేస్తున్న విపత్తును అరికట్టడానికి ప్రభుత్వం తన వంతుగా సాయం చేస్తుంది. అందులో భాగం అవుతున్నారు కొందరు సెలబ్రిటీస్. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ సారి ఊహించిన దానికంటే ఎక్కువగానే విరాళం అందుతున్నాయి. ఇప్పుడు దగ్గుబాటి కుటుంబం కూడా ముందుకొచ్చింది. అందరూ ఇచ్చిన తర్వాత ఇద్దాంలే అనుకున్నారో ఏమో కానీ.. వెంకటేష్, సురేష్ బాబు, రానా కలిపి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. కరోనా మహమ్మారిఫై చేస్తున్న యుద్ధానికి మా చిన్న సాయం అంటున్నారు వాళ్లు. ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వాటికీ తమవంతుగా ఈ విరాళాలు అందిస్తున్నట్లు చెప్పాడు సురేష్ బాబు. ఇంకా అక్కినేని కుటుంబం మాత్రమే బ్యాలెన్స్ ఉండిపోయింది. 

More Related Stories