English   

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ హీరొయిన్...అసలు ఎవరీమె ?

Daisy-Edgar-Jones
2019-03-14 17:52:59

తెలుగు సినిమాని, తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెలుగులోని ఇద్దరు స్టార్ హీరోలు, ఒక బాలీవుడ్ స్టార్ హీరో, ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఒక కోలీవుడ్ స్టార్ యాక్టర్ కం డైరెక్టర్ లను కలిపి తీస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. సినిమా మొదలుపెట్టినప్పటి నుండి ఈ సినిమా గురించిన విషయాలు ఏమీ జనాల్లో తెలియవు కాబట్టి ఆయన ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న అన్ని సందేహాలను దాదాపుగా నివృత్తి చేసే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి చెబుతూ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నుండి అలియా భట్ తారక్ కి మాత్రం ఓ ఇంగ్లీష్ భామ పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. నిజానికి జక్కన్న ఆ పేరు చెప్పినపుడు ఎవరికీ అర్ధం కాలేదు, ఏదో పేరు ఉంటుందిలే తర్వాత చూడచ్చు అనుకున్నారు, కానీ జక్కన్న ప్రకటన చేయగానే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నుండి అధికారిక ట్విట్టర్ లో ఆమె పేరు ని అనౌన్స్ చేశారు. ఆమె పేరు డైసీ ఎడ్గార్ జోన్స్. నిజానికి ఆమె ఎంతో టాలెంటేడ్ అయుంటే తప్ప జక్కన్న ప్రత్యేకంగా ఆమెను తీసుకురాడు. ఇంతకీ డైసీ ఎవరని మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే కొన్ని విషయాలు తెలిసాయి. డైసీ ఎడ్గార్ జోన్స్ ఓ బ్రిటీష్ నటి. ఆమె ఇంతకుముందు సైలెంట్ విట్నెస్, కోల్డ్ ఫీట్ వంటి టీవీ సిరీస్ లలో నటించి నటిగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. పాండ్ లైఫ్ అనే ఆంగ్ల చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించింది. నిజానికి డైసీ ఓ డ్రామా ఆర్టిస్ట్. మన బాషలో చెప్పాలంటే నాటకాల బ్యాచ్ అన్నమాట. బ్రిటన్ లోని మస్వెల్ హిల్స్ ప్రాంతానికి చెందిన ఈమే ద మౌంట్ స్కూల్ ఫర్ గాళ్స్ లో విద్యాభ్యాసం చేసింది. ఆ తర్వాత వుడ్ హౌస్ థియేటర్ స్టడీస్ సెంటర్ (వుడ్ హౌస్ డ్రామా కాలేజ్) లో చేరి నటనకు సంబంధించిన కోర్సులు అభ్యసించింది. సో మనోళ్ళకి పెద్దగా ఆమె ఎక్కపోవచ్చు కానీ రాజమౌళి చేతిలో పడింది కాబట్టి ఈ సినిమా వరకూ మనోళ్ళు ఆదరిస్తారు ఇబ్బంది లేకుండా.

More Related Stories