English   

మరోసారి రిపీట్ కాబోతున్న డార్లింగ్ కాంబో

 A Karunakaran
2021-06-08 18:38:58

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో డార్లింగ్ ఒకటి. ఈ సినిమాలో ప్రభాస్ కాజల్ జంటగా నటించారు. కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లోనే ఓ మంచి ఫీల్ గుడ్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా తో ప్రభాస్ ఓ డార్లింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు మరో సారి కాంబో రిపీట్ అవ్వబోతుందంటూ ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు కరుణాకరన్ ఓ స్క్రిప్ట్ తో ప్రభాస్ ను కలిసారట. ఇప్పటికే ప్రభాస్ లు కథను కూడా వినిపించారట. ఒకవేళ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కుతుందని టాక్ వినిపిస్తోంది. 

మరోవైపు ప్రభాస్ కూడా వరుసగా యాక్షన్ సినిమాలు బోర్ గా ఫీల్ అవుతున్నారట. దాంతో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్  చేయాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రభాస్ ఒకే చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ప్రభాస్ కరుణాకర్ కు మరో ఛాన్స్ ఇస్తారో లేదో. ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం మూడు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. అవి సలార్, ఆది పురుష్ మరియు రాధే శ్యామ్ కాగా వీటిలో రాధే శ్యామ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఇక సలార్ మరియు ఆది పురుష్ సినిమాలు షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటున్నాయి.

More Related Stories