English   

ఆ ఫ్లాప్ డైరెక్టర్ తో శ‌ర్వానంద్..

Dasarath-To-Direct-Sharwanand-s-Next
2017-05-03 08:16:51

శ‌ర్వానంద్ సూప‌ర్ ఫామ్ లో ఉన్నాడు. ఈయ‌న న‌టించిన సినిమాల‌న్నీ వ‌ర‌స విజ‌యాలు అవుతున్నాడు. మే 12న రాధాగా వ‌స్తున్నాడు ఈ కుర్ర హీరో. ప్ర‌స్తుతం మారుతితో మ‌హానుభావుడు సినిమా చేస్తున్నాడు శ‌ర్వా. ఈ సినిమాపై కూడా భారీ అంచ‌నాలున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో శ‌ర్వానంద్ ఓ రిస్క్ తీసుకోడానికి ఇష్ట‌ప‌డుతున్నాడు. అదే ద‌శ‌ర‌థ్ తో సినిమా. అవును.. అప్పుడెప్పుడో సంతోషం.. ఆ త‌ర్వాత మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్.. హిట్లిచ్చిన ద‌శ‌ర‌థ్ మ‌ధ్య‌లో మాత్రం భ‌యంక‌ర‌మైన ఫ్లాపులు ఇచ్చాడు.

ఇలాంటి ద‌ర్శ‌కుడితో ఇప్పుడు శ‌ర్వా సినిమా చేయ‌బోతున్నాడు. టైటిల్ కూడా ఋతురాగాలు అని ఫిక్స్ చేసారు. మెగా హీరోల దెబ్బ‌కు కుదేలైన నిర్మాత ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. ప‌ర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం శ‌ర్వానంద్ కెరీర్ కు మంచి ఊపు తీసుకొస్తుంద‌ని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. అయితే వ‌ర‌స హిట్స్ లో ఉన్న‌పుడు ఇలా వ‌ర‌స‌గా ఫ్లాప్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌డం మాత్రం చాలా రిస్క్ అంటున్నారు శ‌ర్వానంద్ అభిమానులు. చూడాలిక‌.. శ‌ర్వాను ద‌శ‌ర‌థ్ ఏం చేస్తాడో..?

More Related Stories