English   

రవితేజ ఖిలాడి  టీజర్‌ డేట్ 

Ravi Teja
2021-04-09 16:09:15

రవితేజ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘క్రాక్’ సినిమా విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ.. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఖిలాడి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది. ఈ గ్లింప్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. 

అయితే ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్‌కి మరో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 10.08 గంటలకు ఈ సినిమా టీజర్‌ని విడుదల చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

More Related Stories