English   

లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

 Naga Chaitanya
2021-04-06 16:39:46

నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టొరీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. తెలంగాణ బ్యాగ్డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతే కాకుండా ఎక్కువ శాతం ఈ సినిమా షూటింగ్ ను నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో షూట్ చేశారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కాబోతోంది. కాగా సినిమా నుండి విడుదల చేసిన టీజర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులు సినిమా ట్రైలర్ కోసం వేచి చూస్తున్నారు. 

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ఎప్రిల్ 8న విడుదల కాబోతునట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించే ఉద్దేశ్యం ఉన్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఎప్రిల్ 13న ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.  అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక సమాచారం వచ్చేవరకు ఆగాల్సిందే.

More Related Stories