English   

డియర్ కామ్రేడ్ కి అనుకోని చిక్కులు ? నిజమేనా ?

Dear Comrade
2019-06-15 17:16:46

అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాల సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్ లు కొట్టి విజయ్ దేవరకొండ సెన్సేషనల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలు ఇచ్చిన కిక్ తో డియర్ కామ్రేడ్ సినిమాని తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమా మే 31 విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాని తెలుగుతో పాటు నాలుగు భాషల్లో విడుదల చేస్తుండగా అదే టైంలో తమిళ్‌ లో ఎన్జీకే రిలీజ్ అవుతుందని డియర్ కామ్రేడ్ ని రెండు నెలలు పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాని కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి రెండు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి, అందులో మొదటి ప్రచారం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా రషెస్ చూశాక కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేయాలని మేకర్స్ భావించారట. ఇంకా కొన్ని సీన్స్ చిత్రీకరించాల్సి ఉండడంతో అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం లేదని అంటున్నారు. ఇక మరో ప్రచారం ప్రకారం ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే అదే రోజున హాలీవుడ్ సినిమా 'ది లయన్ కింగ్' అనే చిత్రం రాబోతు ఉండటం ‘డియర్ కామ్రేడ్’ రిలీజ్ కి సమస్యగా మారుతుందని అంటున్నారు. లయన్ కింగ్ సినిమాకి అమెరికా సహా ఓవర్సీస్ ఎక్కువ క్రేజ్ ఉంది. దీంతో డియర్ కామ్రేడ్ సినిమాకి ఎక్కువ థియేటర్లు దొరకవని అందుకే వాయిదా వేయచ్చని అంటున్నారు.  ఈ నేపథ్యంలో డియర్ కామ్రేడ్ జులై 26న రావడం కష్టమవుతుందేమో చూడాలి.  

More Related Stories