English   

సినిమాల్లో మిస్సింగ్...ఇప్పుడేమో బికినీలో ?

Deeksha Seth
2019-05-18 18:44:31

దాదాపు పదేళ్ల క్రితం వేదం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దీక్షా సేథ్. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించినా అనుకున్న మేర గుర్తింపు దక్కలేదు. అదృష్టమో ఏమో కానీ చేసింది కొన్ని సినిమాలే అయినా అన్నీ అగ్రహీరోల సరసనే అయినా ఈమెకి ఏమీ కలిసి రాలేదు. అయితే ఈ మధ్యకాలంలో ఈ భామ మిస్సింగ్ సినిమాలు దొరక్కో లేక సినిమా వాళ్ళకి ఈ భామ దొరక్కో కానీ అసలు సినిమాల్లో లేకుండా పోయింది. అయితే ఆమె ముంబై లో బిజినెస్ లు చేసుకుంటూ బిజీగా వుందట. అయితే ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంది. రీసెంట్ గా మాల్దీవ్ బీచుల్లో బికినీ లో ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ భామ...అయితే ఈ ఫోటోలు సంతోషంతో పోస్ట్ చేసిందా లేక మళ్ళీ నేను సినిమాలకి రెడీ అని సిగ్నల్స్ ఇస్తుందా ? అనేది వీడని చిక్కుముడిగా మారింది. 

More Related Stories