English   

ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా...దీపికా షాకింగ్ రెమ్యునరేషన్

 Deepika Padukone
2021-06-13 12:16:40

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా తో పాటు ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉండగానే ప్రభాస్ నెక్స్ట్ సినిమా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.  అంతే కాకుండా ఈ సినిమాలో ప్రభాస్  నెవర్ బిఫోర్ రోల్ లో నటించబోతున్నాడని నాగ్ అశ్విన్ ఇటీవలే వెల్లడించారు. సలార్ ఆది పురుష్ సినిమాల తరవాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. 

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే, నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం దీపికా షాకింగ్ రెమ్యునరేషన్ ను పుచ్చుకుంటోందని టాక్. తెలుగులో దీపికా హీరోయిన్ గా ఇదే మొదటి సినిమా కాగా ఈ సినిమా కోసం రూ. 8 కోట్ల వరకూ వసూలు చేస్తోందట. అంతే కాకుండా ఈ సినిమాలో దీపికా పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందట. ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది.

More Related Stories