English   

పెళ్లైనా.. కాక‌పోయినా ఒకటే అంటున్న దీపిక ప‌దుకొనే.. 

Deepika-Padukone
2019-03-20 10:40:43

అవును.. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ల‌కు పెళ్లి త‌ర్వాత అనేది జ‌స్ట్ ఒక ట్యాగ్ మాత్ర‌మే.. ముందు వెన‌క పెద్ద‌గా తేడా ఏంలేదు. వాళ్లేం చేయాలని ఫిక్సైపోతే అదే చేస్తున్నారు. పెళ్లికి ముందు ఎలా ఉన్నా పర్లేదు కానీ పెళ్లి తర్వాత మాత్రం విచ్చలవిడిగా రెచ్చిపోతే కచ్చితంగా అభిమానుల నుంచి సెటైర్లు వస్తాయి. కానీ బాలీవుడ్ హీరోయిన్లు ఇవన్నీ అస్సలు పట్టించుకోరు. పెళ్లికి ముందు ఎలా ఉన్నారో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటారు. భర్త ఫీల్ అవుతాడు.. అని అత్తమామలు ఏదో అనుకుంటారని వాళ్ళు చేయాలనుకున్న పని మాత్రం చేయకుండా ఆపరు. ఇప్పుడు దీపికా పదుకొనే కూడా ఇదే చేస్తుంది. రన్వీర్ సింగ్ తో పెళ్లి అయిన తర్వాత కూడా ఇప్పటికీ హాట్ హాట్ అందాలు ఆరబోస్తుంది దీపికా పదుకొనే. ఆ మధ్య ఒక మాగజైన్ కోసం ఏకంగా బికినీ ఫోటోషూట్ చేసి సంచలనం సృష్టించింది ఈ కన్నడ కస్తూరి. ఇక ఇప్పుడు మరోసారి అందాల ఆరబోతతో పిచ్చెక్కించింది దీపికా పదుకొనే. తాను రెచ్చిపోవాలి అనుకుంటే రెచ్చిపోతాను.. దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు అంటుంది దీపికా. పెళ్లి తర్వాత కూడా ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. మరోవైపు రన్వీర్ సింగ్ కూడా సూపర్ స్టార్ గా ఎదుగుతున్నాడు. బాలీవుడ్ ఫ్యూచర్ నెంబర్ వన్ అని అంటూ అభిమానులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇలాంటి సమయంలో దీపికా పదుకొనే కూడా అందాల ఆరబోతతో ఇప్పటికీ నెంబర్ వన్ హీరోయిన్ అని నిరూపించుకుంటుంది. మొత్తానికి ఈ జోడి ఇప్పుడు బాలీవుడ్ లో ట్రెండింగ్ అయిపోతుంది.
 

More Related Stories