English   

ప్రభాస్‌కు జోడీగా దీపిక పదుకొనే.. ఇదిగో సాక్ష్యం..

prabhas
2020-05-31 13:04:44

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా లవ్ స్టోరీ. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మహానటితో సంచలన విజయం సాధించిన ఈయన రెండేళ్లకు పైగా కూర్చుని ఈ కథ రాసుకున్నాడు. సోషియో ఫాంటసీ జానర్‌లో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ దాదాపు 250 కోట్లతో నిర్మించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు దీపికా పదుకునే పేరు తెరపైకి వచ్చింది. దీనికి సాక్ష్యం కూడా వచ్చేసింది. తాజాగా దీపిక పదుకొనే తన సోషల్ మీడియా పేజీలో మహానటి సినిమాను అందరూ చూడండని పోస్ట్ పెట్టింది.

సాధారణంగా తెలుగు సినిమాల వైపు కనీసం పట్టించుకోని బాలీవుడ్ హీరోయిన్లు అంత ప్రత్యేకంగా మహానటి సినిమాను పొగడటం ఏంటి.. పైగా దాన్ని చూడాలంటూ ప్రమోట్ చేయడమేంటి అనుకుంటున్నారు. దాని వెనక కారణం నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమానే. మహానటి సినిమాను తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ఇప్పుడు ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. ఆయన సినిమాలో దీపికను ఎంచుకుంటున్నారు. అందుకే మహానటి సినిమా గురించి పోస్ట్ చేసింది దీపిక అంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఈ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతుంది. దేవకన్యకు, మానవుడికి పుట్టిన బిడ్డగా ఈ చిత్రంలో ప్రభాస్ నటించబోతున్నాడని తెలుస్తుంది. అతీత శక్తులున్న వాడిగా ప్రభాస్ పాత్ర ఉండబోతుంది. మొత్తానికి చూడాలిక.. ఈ చిత్రం ఎలా ఉండబోతుందో.. దీపిక తెలుగు ఎంట్రీ ఎలా మారబోతుందో..?

More Related Stories