English   

దీపిక.. మేఘాల్లో తేలిపోతోంది..!!

deepika padukone
2018-07-23 16:45:55

దీపికా పదుకోణ్.. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. రీసెంట్ గా పద్మావత్ తో మరో బిగ్గెస్ట్ హిట్ బ్యాగ్ చేసుకుని తనకు తిరుగులేదని నిరూపించుకుంటోంది. అటు హాలీవుడ్ లోనూ కొన్ని కాల్షీట్స్ వేస్తూ వాల్డ్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటు రణ్ వీర్ సింగ్ తో ప్రేమాయణం సాగిస్తూ, పెళ్లి విషయంలో ఏ హింటూ లేకుండా మీడియాను వెంట తిప్పుకుంటూ జాణతనం చూపిస్తోంది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ.. మాగ్జిమం సినిమాల్లో తనే సెంటర్ పాయింట్ గా ఉంటోన్న దీపిక ప్రస్తుతం మేఘాల్లో తేలిపోతోంది.. అందుకు కారణం అమ్మడికి లండన్ నుంచి పిలుపొచ్చింది. 

లండన్ నుంచి పిపులు రావడం అంటే ఏదో షూటింగ్ కోసం కాదు.. దీపిక బొమ్మను అక్కడి టుస్సాడ్ మ్యూజియంలో పెట్టబోతున్నారు. అవును.. ఇప్పటి వరకూ బాలీవుడ్ నుంచి చాలామంది ప్రముఖుల విగ్రహాలను ఆ మ్యూజియంలో పెట్టారు. కత్రినా కైఫ్ స్టాచ్యూ కూడా ఉంది. ఇక ఇప్పుడు దీపిక వంతు వచ్చింది. ఇందుకోసం ఆల్రెడీ అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. త్వరలోనే వచ్చి దీపిక కొలతలు తీసుకుని వెళతారు. ఈ విషయం తెలిసిన దగ్గర్నుంచీ ఈ సన్నజాజి ఆల్మోస్ట్ ఆకాశంలో తేలిపోతోందట. ఏదేమైనా ప్రపంచ స్థాయి సెలబ్రిటీస్ ఉండే ఆ మ్యూజియంలో తనకూ చోటు రావడం అంటే చిన్న విషయం కాదు.. అందుకే అమ్మడు ఆనందం పట్టలేకపోతోందన్నమాట.

More Related Stories