English   

ఆర్థిక సమస్యలతో అత్తగారింటికి కన్నం వేసిన నటి..

Deivamagal Suchitra
2020-09-17 17:09:01

సినిమా వాళ్లకు చేతినిండా పని ఉంటుంది.. జేబుల నిండా డబ్బులు ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ వాళ్ళ జీవితాలు దుర్భరంగా ఉంటాయి అని కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందులోనూ ఇప్పుడు కరోనా సమయం కావడంతో చేసుకోవడానికి పనులు లేక.. ఇల్లు గడవడానికి డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక తమిళ సీరియల్ నటి డబ్బుల కోసం ఏకంగా అత్తగారి ఇంట్లోనే కన్నం వేసింది. తమిళనాట దైవమగల్ సీరియల్ తో బాగా గుర్తింపు తెచ్చుకున్న నటి సుచిత్ర తన ప్రియుడి ఇంట్లో దొంగతనం చేసింది. కొన్ని రోజులుగా ఎలాంటి సీరియల్ షూటింగ్ లేకపోవడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దాంతో తెలిసిన వాళ్ళ ఇంట్లోనే చేతివాటం చూపించింది. 

అసలు మ్యాటర్ ఏంటంటే ఈమెకు మణికందన్ అనే ప్రియుడు ఉన్నాడు. అతడికి ఇప్పటికే పెళ్లి అయిపోయింది. ఆయనతో కలిసి కొన్నాళ్లుగా సహజీవనం చేస్తుంది సుచిత్ర. చెన్నైలోని కొందరు నటీనటులకు డ్రైవర్ గా పని చేస్తున్నాడు మణికందన్. ఆ సమయంలోనే సుచిత్ర కు దగ్గరయ్యాడు. ఇద్దరూ కలిసి ఆ తర్వాత దొంగతనాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మణికందన్ ఇంట్లో దొంగతనం చేయాలని ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. పక్కా ప్లాన్ వేసి 50 వేల నగదుతో పాటు 8 సవర్ల బంగారం మరి కొన్ని విలువైన వస్తువులు తీసుకుని ఉడాయించారు. మణికందన్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే మణికందన్ పోలీసుల అదుపులో ఉండగా సుచిత్ర కోసం గాలిస్తున్నారు. ఏదైనా డబ్బుల కోసం అత్తగారి ఇంటికి కన్నం వేసింది ఈ తమిళ నటి. 

More Related Stories