English   

దేవ్ రివ్యూ

Dev
2019-02-14 07:10:03

కార్తీ సినిమా అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులకు ఒక ఐడియా ఉంది. దాంతో దేవ్ సినిమా మీద కూడా మంచి ఆసక్తి ఉంది. ఇప్పుడు ఆ సినిమా విడుదల అయింది మరి వారి అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

కథ:

కార్తీ ఒక అడ్వెంచర్ లవర్. జీవితంలో ప్రతి విషయాన్ని ప్రశాంతంగా తీసుకుంటాడు. ఏది సీరియస్ గా తీసుకోకుండా మనసు చెప్పింది చేస్తూ వెళ్తాడు. ఆయనకు ఎవరెస్ట్ ఎక్కాలి అనేది డ్రీమ్. అలాంటి సమయంలో కార్తి జీవితంలోకి రకుల్ప్  ప్రీత్ సింగ్ వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత తన సమయాన్ని మొత్తం ఆమెకు కేటాయిస్తాడు. కానీ ఒక సమయంలో కాస్త బిజీ అయిపోవడంతో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రకుల్ వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమైంది దేవ్ ఎవరెస్టు ఎక్కాడా లేదా అనేదే సినిమా.

కథనం:

లైఫ్ ను జాలిగా గడిపి హీరోలను మనం ఎంతో మందిని చూశాం. జీవితంలో దీన్ని సీరియస్గా తీసుకోకుండా అన్ని కామెడీగా తీసుకుంటూ ప్రతిదీ మనసుకు నచ్చినట్లు చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు. అలాంటి కథలు కూడా చాలా తక్కువగా వచ్చాయి. ఈ సినిమా కథ కూడా ఇలాంటిదే ఇందులో కార్తీక్ క్యారెక్టర్ ప్రజెంట్ ఉన్న యూత్ ను టార్గెట్ చేసేలా ఉంది. సమాజం ఏమనుకుంటుంది సమాజంలో పరువు ఏమై పోతుంది ఇలాంటి చిన్న చిన్న వాటికి భయపడకుండా తనకు నచ్చినట్లు తనకు బ్రతకడమే ఇందులో హీరో చేసే పని. ఫస్టాఫ్ ముగిసేంతవరకు దర్శకుడు రజత్ రవిశంకర్ తాను చెప్పాలనుకున్న కథను బాగా చెప్పాడు. రకుల్ వచ్చిన తర్వాత కూడా వారిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు బాగానే రాసుకున్నాడు. ట్రెండీగా అనిపించే కథ కనెక్ట్ అవుతుందేమో అనిపించింది, కాని సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలైంది. హీరో హీరోయిన్ కలిసిపోవడంతో ఆ తర్వాత కథ ముందుకు సాగలేదు ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడినుంచి కన్ఫ్యూజన్లో పడిపోయాడు రవిశంకర్. వచ్చింది మళ్ళీ వచ్చి వచ్చి వచ్చి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. చిన్న చిన్న మనస్పర్థలకు విడిపోతున్న ఈ రోజుల్లో తన కథను ఉదాహరణగా చూపించాలనుకున్నాడు రజత్. కేవలం తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని కారణం చూపించి హీరోను వదిలేసి హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఆ తరువాత అదే బాధ లో హీరో ఎవరెస్ట్ ఎక్కేస్తాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది దేవ్ కథ. ఫస్టాఫ్ జస్ట్ ఓకే అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం సహనానికి పరీక్ష పెట్టాడు దర్శకుడు.

నటీనటులు:

కార్ తీయ పట్ల తన పాత్రలో బాగానే నటించాడు. ఇలాంటి పాత్ర చేయడం తొలిసారి. ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందో అలాంటి క్యారెక్టర్ ను ఎంచుకున్నాడు కార్తి. రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోతతో పాటు కాస్త నటనలో పర్లేదు అనిపించింది. మిగిలిన పాత్రల్లో హీరోయిన్ అమ్మ పాత్రలో రమ్యకృష్ణ హీరో తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ టీం:

హరీష్ జయరాజ్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈయన పాటలు అర్థం కాలేదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కడో విన్నట్లుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ చాలా వీక్ గా ఉంది. సెకండాఫ్ చాలా చోట్ల బోర్ కొట్టించాడు. ఇక దర్శకుడు రాసుకున్న కథ బాగానే ఉన్నా దాన్ని తెరకెక్కించే విధానంలో పూర్తిగా గాడి తప్పింది. దాంతో దేవ్ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయాడు.

చివరగా: దేవ్ ఓరి దేవుడో..!!

రేటింగ్: 1/5

More Related Stories