English   

ఇంద్రప్రస్థం అంటూ లైన్ లోకి వచ్చేసిన దేవాకట్టా...వాళ్ళకి కౌంటర్ 

 Deva Katta
2020-08-14 13:56:54

ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఆ నిర్మాత విష్ణు మీద దర్శకుడు దేవా కట్టా కొన్ని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానికి కారణం ఆయన నిర్మాణంలో చంద్రబాబు- వైస్ ల స్నేహం గురించిన ఒక బయోపిక్ అనౌన్స్ మెంట్. ఈ ఆరోపణలు చేసినప్పుడే తను కూడా ఇదే పాయింట్ అనుకున్నానని, దానినే విష్ణు ఇప్పుడు కాపీ కొట్టారని దేవా కట్టా ఆరోపించాడు. ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే కదా అనుకునే లోపే తాను కూడా ఇదే పేరుతో సిరీస్ అనౌన్స్ చేసి షాకిచ్చాడు. రాజకీయ ప్రత్యర్థులు కావడానికి ముందు, నారా చంద్రబాబు నాయుడు మరియు వైయస్ రాజశేఖర్ రెడ్డి మంచి స్నేహితులు. దర్శకుడు దేవ కట్టా ఇప్పుడు ప్రకటించిన తన తదుపరి ప్రాజెక్ట్ అయిన ఇంద్రప్రస్థంలో వారి స్నేహం అలానే రాజకీయ వివాదానికి సంబంధించిన అంశాలను చూపించబోతున్నాడు. 

ఈ రోజు ఆయన రిలీజ్ చేసిన ఇంద్రప్రస్థం యొక్క థీమ్ పోస్టర్ అలానే ఒక మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దేవా కట్టా వాయిస్ ఓవర్లో దానిని రిలీజ్ చేశారు. ప్రపంచంలో జరిగే పోటీలన్నిటికీ పర్పస్ ఒక్కటే, విన్నర్స్ ని ఎంచుకోవడం. విన్నర్స్ రూల్ ద వరల్డ్. ఆ పోటీలో అనుకోకుండా స్నేహితులు ఎదురు అయితే ఆ ఆట కున్న కిక్కే వేరు అంటూ బాబు, వైఎస్ లు ఉన్నట్టుగా కటౌట్ ని డిస్ప్లే చేశారు.  అలాంటప్పుడు "నైతికతలు మారతాయి కాని అధికారం కోసం పోరాటం స్థిరంగా ఉంటుంది" అని పోస్టర్‌లోని ఒక కొటేషన్ ఆసక్తికరంగా ఉంది. ఇక సురేష్ బొబ్బిలి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా బాగుంది. హర్షా వి మరియు తేజా సంయుక్తంగా ప్రొడోస్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
 

More Related Stories