English   

సెప్టెంబర్ లో  నాగ్ అండ్ నాని

devdas

అక్కినేని నాగార్జున, నాని కాంబినేషన్ లో వస్తోన్న డిఫరెంట్ మల్టీస్టారర్ దేవదాస్.. భలేమంచి రోజు, శమంతకమణి ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. అనౌన్స్ మెంట్ నుంచే ఆసక్తిని పెంచిన ఈ టీమ్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. నాగార్జను డాన్ పాత్రలో కనిపిస్తున్నాడు. అతని పేరు దేవా.. ఇక డాక్టర్ దాస్ గా నాని పాత్ర ఉంటుందని ఇప్పటి వరకూ చెబుతున్నారు. మరి అది నిజమేనా కాదా అనేది ఇప్పుడే క్లియర్ గా చెప్పలేం.. కానీ టైటిల్ మాత్రం ఈ రూమర్ కు ఊతమిస్తోంది. 

సెప్టెంబర్ 27న దేవ అండ్ దాస్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. యస్ దేవదాసు సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. ఆ తర్వాతి నెల మూడో వారంలో దసరా పండగ ఉంది. దీంతో ఆ టైమ్ కు పోటీ గట్టిగా ఉంటుంది. అందుకే వీళ్లు కాస్త ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో నాగార్జున సరసన మళ్లీ రావా ఫేమ్ ఆకాంక్ష సింగ్ నటిస్తోంది. నాని సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా రొమాన్స్ చేస్తుంది. మరి డాన్ అండ్ డాక్టర్ స్టోరీ ఎలా ఉంటుందో చూడాలి. 

More Related Stories