English   

దేవి నాగవల్లి ఔట్.. అంతుచిక్కని బిగ్ బాస్ వ్యూహం..

 Devi Nagavalli
2020-09-28 13:28:58

బిగ్ బాస్ నాలుగో సీజన్ మూడోవారంలో ఊహించని ఎలిమినేషన్ ఎదురైంది. నేను చాలా స్ట్రాంగ్.. అందుకే అందరు నన్నే టార్గెట్ చేశారు అంటూ దేవి నాగవల్లి చెప్పిన మాటలు విని అందరు నిజంగానే స్ట్రాంగ్ అనుకున్నారు. ఇంట్లో కూడా నిక్కచ్చిగా మాట్లాడుతూ రెండేళ్ల కింద కౌశల్ ని గుర్తు చేసింది ఈమె. టీవీ9 సపోర్టు కూడా ఉండటంతో ఖచ్చితంగా కనీసం 10 వారాలు ఉంటుందని అభిమానులు కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. సోషల్ మీడియాలో కచ్చితంగా టీవీ 9 సపోర్టు దొరుకుతుందని వాళ్ళు అనుకున్నారు. అయితే ప్రేక్షకులని మనుషుల న్యాయనిర్ణేతలు మరొకరు లేరు అని దేవి నాగవల్లి విషయంలో నిరూపితమైంది. ముందు రెండు వారాలు నామినేషన్స్ లోకి రాలేదు దేవి. మూడో వారంలో కరాటే కళ్యాణి బిగ్ బాంబ్ తో నేరుగా నామినేషన్స్ పంపించింది. అది కాస్తా పెద్ద ప్రమాదమే చేసింది. 

తొలిసారి నామినేషన్స్ లోకి వచ్చి ఎలిమినేట్ అయిపోయింది దేవి నాగవల్లి. దీన్ని బట్టి చూస్తుంటే బయట జనాలకు ఈమెపై అస్సలు మంచి అభిప్రాయం లేదు అనేది అర్థమవుతుంది. పైన టీవీ9 సపోర్టు కూడా ఇంత పెద్దగా పని చేయలేదు. ఇంట్లో బాగా వీక్ అనుకుంటున్న మెహబూబ్, కుమార్ సాయి మెల్లమెల్లగా స్ట్రాంగ్ అవుతున్నారు. స్ట్రాంగ్ అనుకుంటున్న కంటెస్టెంట్స్ రాంగ్ అని నిరూపిస్తున్నారు. ఏదేమైనా కూడా మూడో వారంలో దేవి నాగవల్లి బయటికి రావడం బిగ్ బాస్ లో నిజంగానే ఒక సంచలనం. ఈమె జోరు చూసి కనీసం సగం వరకు ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్లు అయిపోయింది. ఇక్కడి నుంచి కచ్చితంగా బిగ్ బాస్ ఊహకందని విధంగా ఉంటుందని దేవి ఎలిమినేషన్ తో అర్థమైపోయింది.

More Related Stories