English   

షాకింగ్.. చ‌ర‌ణ్ చెల్లితో దేవీకి పెళ్లి..

ram charan dsp

అవునా.. నిజమా.. ఇప్పుడు ఇవే ఎక్స్ ప్రెష‌న్స్ అంద‌ర్లోనూ క‌నిపిస్తున్నాయి. అస‌లే వ‌య‌సు కూడా ముదిరిపోతుంది క‌దా అందుకే ఇప్పుడిప్పుడే పెళ్ళి వైపు ఆలోచిస్తున్నాడు దేవీ శ్రీ ప్ర‌సాద్. ఈయ‌న త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌నున్నాడ‌నే ప్ర‌చారం ఇండ‌స్ట్రీలో గ‌ట్టిగా జ‌రుగుతుంది. అప్ప‌ట్లో ఛార్మితో దేవీకి ఎఫైర్ ఉండేదని.. వీళ్లిద్ద‌రి మ‌ధ్య స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ న‌డుస్తుంద‌ని వార్త‌లు వినిపించాయి. దీనికి తగ్గ‌ట్లే అప్ప‌ట్లో దేవీ, ఛార్మి బిహేవియ‌ర్ కూడా ఉండేది. వాళ్ల గురించి ఎవ‌రేం అడిగినా.. ఇద్ద‌రూ నోరు తెరిచేవాళ్లు కాదు. ఎవ‌రిష్టం వ‌చ్చిన‌ట్లు వాళ్లు రాసుకోండ‌న్న‌ట్లు ఉండేది వీళ్ల య‌వ్వారం. ఓ టైమ్ లో ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటారేమో అనేంత వ‌ర‌కు వెళ్లింది వ్య‌వ‌హారం.
కానీ త‌ర్వాత ఏమైందో ఏమో గానీ దేవీకి మెల్ల‌గా దూర‌మ‌వుతూ వ‌చ్చింది ఛార్మి. డిఎస్పీ కూడా త‌న మ్యూజిక్ తో బిజీ అయ్యాడు. మ‌రోవైపు ఛార్మి మాత్రం పూరీ జ‌గ‌న్నాథ్ కు ద‌గ్గ‌రైంది. ఇప్పుడు కూడా ఈమె అక్క‌డే ఉంది. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. గ‌తాన్ని మ‌రిచిపోయి హాయిగా ఇప్పుడు దేవీ ఓ అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని తెలుస్తుంది. ఆ భామ పేరు పూజిత‌. ఈమె ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లంలో రామ్ చ‌ర‌ణ్ కు చెల్లిగా న‌టిస్తుంది. ఈమెను చూడ గానే ఎందుకో తెలియ‌దు కానీ దేవీకి గుండెల్లో వీణ‌లు మోగాయ‌ని తెలుస్తుంది. అందుకే అంద‌ర్నీ ఒప్పించి పెళ్ళికి సిద్ధం అవుతున్నాడ‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. చివ‌రి వ‌ర‌కు ఏం జ‌రుగుతుందో..? 

More Related Stories