English   

ఫ్రస్టేషన్ లో దేవీ శ్రీ ప్రసాద్

devi sri prasad on prestition

టాలీవుడ్ లో మోస్ట్ బిజీయొస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే దేవీ శ్రీ ప్రసాదే. మరి మరీ అంత బిజీగా ఉంటే ఫ్రస్టేషన్ రాక ఏమౌతుంది అనుకోనక్కర్లేదు. ఎందుకంటే అతను ఫ్రస్టేషన్ లో ఉన్నాడంటే పర్సనల్ కాగు.. మూవీలో. యస్.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’కు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి ట్విట్టర్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు.  

ఇప్పటి వరకూ అనిల్ రావిపూడి చేసిన పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలకు సాయి కార్తీక్ సంగీతం అందించాడు. మరి ఏమైందో కానీ.. ఇప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ తో వెళుతున్నాడు. అయితే అనిల్, కార్తీక్ ల మధ్య విభేదాలేవీ లేనట్టుగానే చెబుతున్నారు. కాకపోతే ఇంత బిజీలో దేవీ ఈ సినిమాను ఒప్పుకోవడం కొంత ఆశ్చర్యం కలిగించేదే. అనిల్ సినిమాల్లో కొత్తదనం ఉండదు కానీ.. నవ్వుల ధనం ఉంటుంది. అదే అతని సినిమాల విజయాలకు కారణం. 

ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేస్తోన్న ఈ మల్టీస్టారర్ లో వెంకీ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వరుణ్ తో మెహ్రీన్ కౌర్ రొమాన్స్ చేయబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ త్వరలోనే రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. ఏదేమైనా దేవీ రాకతో ఈ ప్రాజెక్ట్ కు మరింత వెయిట్ వస్తుందనేది మాత్రం నిజం. 

More Related Stories