English   

దేవీ శ్రీ ప్రసాద్‌కు బంపర్ ఆఫర్.. సల్మాన్‌తో దింక్ చికా.. 

 Devi Sri Prasad
2020-03-30 16:59:03

ఒకప్పుడు ఏ సినిమాకు చూసినా కూడా దేవీ శ్రీ ప్రసాద్ పేరు కనిపించేది. మణిశర్మ సైలెంట్ అయిపోయిన తర్వాత తమన్ రొటీన్ మ్యూజిక్ ఇస్తున్న వేళ కుమ్మేసాడు దేవీ. ఈయనతో సినిమా కోసం స్టార్ హీరోలు కూడా వేచి చూసారు. అయితే కొన్నాళ్లుగా ఈయన మాయ పని చేయడం లేదు. థమన్ దూకుడు చూపిస్తుండటం.. మణిశర్మకు మళ్లీ మంచి రోజులు రావడంతో దేవీకి గడ్డు కాలం నడుస్తుంది. పైగా చేసిన సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. మొన్న విడుదలైన సరిలేరు నీకెవ్వరు పాటలు కూడా అంతగా హిట్ కాలేదు. మైండ్ బ్లాక్ తప్ప ఇంకో పాటే వినిపించలేదు. ఇలాంటి సమయంలో ఈయనకు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. 

ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తున్నా కూడా అది కెరీర్ మార్చేసే సినిమాలైతే కావు. నితిన్ హీరోగా రంగ్ దే సినిమాకు సంగీతం అందిస్తున్నాడు డిఎస్పీ. దాంతో పాటు బెల్లంకొండ అల్లుడు అదుర్స్ కు కూడా ఈయనే సంగీత దర్శకుడు. ఇదిలా ఉంటే కెరీర్ ఇలా ఉన్న సమయంలో బాలీవుడ్ ఆఫర్ వచ్చింది దేవీ శ్రీ ప్రసాద్ కు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళంలో కూడా కొన్ని సినిమాలకు సంగీతం అందించిన ఈయన.. ఇప్పుడు బాలీవుడ్ వెళ్తున్నాడు. అక్కడ కూడా మనోడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దేవీ అందించిన దింక్ చికా సాంగ్ సంచలనమే. రెడీలో ఈ పాటను వాడుకున్నాడు సల్మాన్ ఖాన్. ఇక ఇప్పుడు కూడా మరోసారి ఈయనే దేవీకీ ఆఫర్ ఇస్తున్నాడు. 

సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న రాధే సినిమాలో మూడు పాటలకు దేవీ సంగీతం అందించే అవకాశం అందుకుంటున్నాడు. ప్రభుదేవాతో దేవికి మంచి అనుబంధమే ఉంది. ఈయన తెలుగు, తమిళంలో తెరకెక్కించిన చాలా సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పుడు ఇదే నమ్మకంతో బాలీవుడ్ కు కూడా తీసుకెళ్తున్నాడు ఈయన. రాధే సినిమాలో మూడు పాటలకు దేవీ.. మిగిలిన పాటలకు మరొకరు సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి రాధే పాటలు కానీ హిట్ అయ్యాయంటే దేవీకి అక్కడ కూడా క్రేజ్ రావడం ఖాయం. ప్రస్తుతం తెలుగులో సుకుమార్, బన్నీ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు దేవీ శ్రీ ప్రసాద్. 

More Related Stories