English   

మెగా హీరో కోసం మలయాళీ భామ

actress
2019-04-19 07:40:26

మెగా ఫ్యామిలీ నుండి తెలుగు తెరకి ప‌రిచ‌య‌మవుతున్న మ‌రో హీరో వైష్ణ‌వ్ తేజ్‌. హీరో ధరమ్ తేజ సొంత్ తమ్ముడు అయిన ఈయన డెబ్యూ సినిమా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు, సుకుమార్ కథను అందించిన ఈ సినిమా బెస్త‌వాళ్ళు(మత్స్యకారుల) నేపధ్యంలో తెర‌కెక్కుతుంద‌ని ప్ర‌చారం జరుగుతోంది. దీనికి తగ్గట్టే సినిమా నుండి విడుదలయిన ఫస్ట్ లుక్ లో కూడా వైష్ణవ్ తేజ్ అలాగే ఉండి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నా ఈ సినిమా రంగ‌స్థ‌లం లాంటి ఎమోష‌న‌ల్ మూవీలా ఉంటుంద‌ని అంటున్నారు. రంగస్థలం ఫేమ్ రామకృష్ణ సబ్బాని, మౌనికలు ఆర్ట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమాలో హీరోయోన్ కోసం యూనిట్ కిందా మీదా పడుతుండగా తాజాగా ఒక మలయాళ హీరియిన్ ని ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. మలయాళ బ్యూటీ దేవిక సంజయ్‌ని ఈ సినిమా హీరోయిన్‌ గా ఎంపిక చేశారని అంటున్నారు. ఈ భామ ఫాహ‌ద్ ఫాజిల్ ప్ర‌ధాన పాత్రలో వచ్చిన ఎన్‌జ‌న్ ప్ర‌కాశ‌న్ అనే మ‌ల‌యాళ చిత్రంతో బాగా పాపుల‌ర్ అయింది. ఆమెనే ఈ సినిమాకి ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. దీని మీద మరింత క్లారొఇతే రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

More Related Stories