English   

బిగ్ బాస్ లోకి దేవీశ్రీ ప్రసాద్ హీరోయిన్

pooja ramachandran
2018-07-24 17:43:17

బిగ్ బాస్ సీజన్ -2 అనుకున్నంత రసవత్తరంగా సాగడం లేదు. ఇప్పటికే కాస్త ఎంటర్టైన్ చేస్తున్నారు అనుకున్న వారందరినీ ఎలిమినేట్ చేశారు. నిజానికి ఈ సీజన్ లో వీళ్లే షోకు గ్లామర్ పాయింట్. అయినా ఎలిమినేట్ చేసి ఇప్పుడు బాధపడుతున్నారు. ప్రస్తుతం ఉన్నంతలో ఆడియన్స్ ను ఎంటర్టైనర్ చేయడానికి ఆర్గనైజర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో సెక్సీ బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోనికి పింపించారు. తనే పూజా రామ్ చంద్రన్. స్వామిరారా, దేవీ శ్రీ ప్రసాద్ వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ బోల్డ్ భామగా గుర్తింపు తెచ్చుకుంది. దేవీ శ్రీ ప్రసాద్ లో శవంగా నటించింది. ఈ సినిమాలో శవంతో సెక్స్ సీన్స్ కూడా ఉంటాయి. పాత్ర కోసం అంత బోల్డ్ రోల్స్ కూడా చేయగలదీ భామ. 

ఇక గత కొన్ని రోజులుగా పూజా రామ్ చంద్రన్ తో బిగ్ బాస్ ఆర్గనైజర్స్ సంప్రదింపులు జరిపారు. అక్కడి కండీషన్స్, హౌస్ పరిస్థితులపై ట్రెయిన్ చేశారట. ఇవాళ(24.07.18) ఉదయం 4గంటలకు తను హౌస్ లోకి ఎంటర్ అయిపోయింది. ఓ దుప్పటి కప్పుడు ఎవరికీతెలియకుండ పడుకుండిపోయింది. మొత్తంగా ఇప్పటి వరకూ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎవరు వస్తారా అనుకున్న ఆడియన్స్ కు బిగ్ బాస్ ఆర్గనైజర్స్ షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే ఆ భామ ఆడియన్స్ లో ఏమంత అటెన్షన్ క్రియేట్ చేస్తుందనుకోలేం. పైగా తను తెలిసిన ప్రేక్షకులు కూడా చాలా అంటే చాలా తక్కువే. మరి ఈ పర్పస్ తో ఈ పాపను హౌస్ లోకి పంపించారో చూడాలి. 

More Related Stories