English   

అక్క‌ను మించిన చెల్లి..!!

jhanvi kapoor
2018-07-22 15:26:53

బాలీవుడ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది వార‌సురాళ్లు వ‌చ్చారు. కానీ ఎవ‌రూ చేయ‌లేని అద్భుతాల‌ను ఇప్పుడు ఝాన్వీక‌పూర్ చేస్తుంది. ఈమె న‌టించిన తొలి సినిమా ధ‌డ‌క్ వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ వార‌సురాలికి రాని గుర్తింపు.. క్రేజ్.. మార్కెట్ తొలి సినిమాతోనే ఝాన్వీ అందుకుంటుంది. సైరాత్ కు రీమేక్ గా వ‌చ్చిన ధ‌డ‌క్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది ప్రేక్ష‌కుల నుంచి. ఒరిజిన‌ల్ చూసిన వాళ్ల‌కు పెద్ద‌గా న‌చ్చ ట్లేదు కానీ చూడ‌ని వాళ్ల‌కు మాత్రం ధ‌డ‌క్ గుండెలో ధ‌డ‌క్ పుట్టిస్తుంది. దాంతో తొలి సినిమాతోనే ఝాన్వీకి మ‌రుపురాని విజ‌యం వ‌చ్చిన‌ట్లైంది. ఈ చిత్రాన్ని క‌ర‌ణ్ జోహార్ తో క‌లిసి జీ స్టూడియోస్ నిర్మించారు. 

ఇషాన్ క‌ట్ట‌ర్ హీరోగా న‌టించాడు. శ‌శాంక్ కైతాన్ ద‌ర్శ‌కుడు. ఇవ‌న్నీ ఇలా ఉంటే తొలి రోజు 8.7 కోట్లు వ‌సూలు చేసిన ధ‌డ‌క్.. రెండోరోజు 11 కోట్లు వ‌సూలు చేసింది. గ‌తంలో అలియా భ‌ట్ తొలి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ తొలి రోజే 7.4 కోట్లు.. హీరోపంటి 6.6 కోట్లు.. ప‌రిణీతి చోప్రా ఇష‌క్ జాదే 4.54 కోట్లు.. సోన‌మ్ క‌పూర్ తొలి సినిమా సావ‌రియా 3 కోట్లు వ‌సూలు చేయ‌గా.. ఇప్పుడు ధ‌డ‌క్ మాత్రం వాట‌న్నింటినీ దాటేసి 8.71 కోట్లు వ‌సూలు చేసింది.  సోన‌మ్ తో పాటు ఇండ‌స్ట్రీలో ఉన్న వార‌సురాళ్లు అంద‌రికంటే ధ‌డ‌క్ కు ఓపెనింగ్స్ అద్భుతంగా వ‌స్తున్నాయి. చూస్తుంటే ఈ చిత్రంతో ఝాన్వీ బాలీవుడ్ కు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన‌ట్లే..!

More Related Stories