ధడక్ షో పడింది.. అదిరిందంట..

ధడక్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీదేవి కూతురు పరిచయం అవుతున్న సినిమా కాబట్టి ఆ మాత్రం అంచనాలు ఉండటం కామన్. పైగా ఈ చిత్రం కూడా మరాఠీలో చరిత్ర సృష్టించిన సైరాత్ కు రీమేక్ కాబట్టి ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. జులై 20న విడుదల కానుంది ఈ చిత్రం. ముంబైలో వారం రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్ పడిపోయింది. కపూర్ ఫ్యామిలీతో పాటు మిగిలిన బాలీవుడ్ కూడా అంతా ధడక్ షోకు వచ్చారు. శ్రీదేవి కూతురు పర్ఫార్మెన్స్ కు కొందరు అయితే ఏకంగా కన్నీరు కూడా పెట్టుకున్నారు.
సైరాత్ చివర్లో హీరో హీరోయిన్లను చంపేస్తారు. పరువు హత్యల నేపథ్యంలో నాగ్ రాజ్ మంజులే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇదే కథను తీసుకుని హిందీలోనూ తెరకెక్కించాడు దర్శకుడు శశాంత్ కైతాన్. అక్కడ కూడా శ్రీదేవి కూతురును క్లైమాక్స్ లో చంపేసారనే తెలుస్తుంది. సైరాత్ కంటే వందరెట్లు రిచ్ గా ధడక్ ను తెరకెక్కించాడు దర్శకుడు. ఇదే సినిమాకు ప్రత్యేకంగా మారుతుంది. సైరాత్ చూసిన వాళ్లకు కూడా ధడక్ నచ్చుతుందంటున్నాడు దర్శకుడు. ఈ చిత్రంలో ఝాన్వీ కపూర్ తో పాటు ఇషాన్ కొట్టర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. మరి సెలెబ్రెటీస్ కు నచ్చిన ధడక్.. ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి..!