English   

బాహుబ‌లి 2కు అడ్డొస్తున్న దంగ‌ల్.. 

Dhangal-Beats-Baahubali-2-In-Overseas
2017-05-09 06:12:31

ప్ర‌పంచ‌మంతా బాహుబ‌లి 2 హ‌వా న‌డుస్తుంటే.. ఒక్క చైనాలో మాత్రం అమీర్ ఖాన్ హ‌వా న‌డుస్తుంది. అక్క‌డ దంగ‌ల్ సినిమా రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుంది. గ‌తేడాది ఇండియాలో కుమ్ముడు అయిపోయింది. ఇప్పుడు అమీర్ ఖాన్ చైనా కుమ్ముడు మొద‌లుపెట్టాడు. ఇండియా మాదిరిగానే చైనాలో కూడా తొలిరోజు నుంచి ఒకే దూకుడుతో దూసుకుపోతున్నాడు అమీర్. సినిమాకు సూప‌ర్ పాజిటివ్ టాక్ రావ‌డం.. అక్క‌డ కూడా పెద్ద సినిమాలేవీ లేక‌పోవ‌డంతో దంగ‌ల్ చైనాలోనూ దున్నేస్తుంది. 3 రోజుల్లోనే ఇండియ‌న్ క‌రెన్సీలో 75 కోట్లు కొల్లగొట్టింది దంగ‌ల్. పీకే మూడు రోజుల్లో 45 కోట్లు వ‌సూలు చేస్తే.. ఇప్పుడు దంగ‌ల్ దాన్ని మించిపోయింది.

ఇప్పుడు అమీర్ ముందున్న ల‌క్ష్యం 150 కోట్లు.. పీకే అక్క‌డ 100 కోట్లు వ‌సూలు చేసింది. ఇప్పుడు దంగ‌ల్ దూకుడు చూస్తుంటే చైనాలో 150 కోట్లు అందుకోవ‌డం పెద్ద క‌ష్టంగా ఏం అనిపించ‌ట్లేదు. ఇది సాధిస్తే.. 200 కోట్ల‌తో అగ్ర‌స్థానంలో చైనాలో కొత్త శకానికి నాందీ ప‌లుకుతాడు అమీర్ ఖాన్. చూడాలిక అమీర్ ఈ యుద్ధాన్ని ఇంకెంత దూరం తీసుకెళ్తాడో..! అన్న‌ట్లు చైనాలో మ‌రో వారం రోజుల వ‌ర‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొత్త సినిమాలేవీ లేవండోయ్.. అందుకే అమీర్ లెట్స్ డూ కుమ్ముడు..!

More Related Stories