English   

ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ కు ధనుష్ కాల్

ajay bhupathi
2018-07-26 21:10:36

ఆర్ఎక్స్ హండ్రెడ్.. ఈ మధ్య కాలంలో జెన్యూన్ గా సూపర్ హిట్ కొట్టి సినిమా. ఏ అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న సినిమా. అంతా కొత్తవారే. అయితేనేం కొత్త కంటెంట్ తో కోట్లు కొల్లగొట్టారు. కేవలం కోటిన్నర నుంచి రెండు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆర్ఎక్స్ హండ్రెడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 9కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇంకా స్టడీగా రన్ అవుతూనే ఉంది. రెండు వారాలు దాటినా కలెక్షన్స్ తగ్గలేదీ సినిమాకు. దీంతో ఈ దర్శకుడిపై ఇప్పటికే టాలీవుడ్ నుంచి చాలామంది ప్రొడ్యూసర్స్ కళ్లు పడ్డాయి. లేటెస్ట్ గా కొందరు నిర్మాతలు అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు. ఫలానా హీరోతో నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు.. అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇవన్నీ పక్కన బెట్టిన ఈ దర్శకుడు ఇప్పుడు చెన్నైకు బయలుదేరాడు. కారణం.. అతనికి అక్కడి స్టార్ హీరో ధనుష్ నుంచి కాల్ రావడమే. యస్.. ధనుష్ స్వయంగా ఫోన్ చేసిన ఆర్ఎక్స్ హండ్రెడ్ దర్శకుడు అజయ్ భూపతికి ఫోన్ చేసి చెన్నై రమ్మన్నాట్ట. 

ఇలాంటి కల్ట్ మూవీస్ ను బాగా ఇష్టపడి చేస్తాడు ధనుష్. అతని ఖాతాలో ఇలా రా మూవీస్ చాలానే ఉన్నాయి.అయితే దర్శకుడు ఆర్ఎక్స్ హండ్రెడ్ ను డీల్ చేసిన విధానం ధనుష్ కు బాగా నచ్చిందట. అందుకే తను సినిమా చూడ్డమే కాదు.. దర్శకుడికి ఫోన్ చేసి తనను కలవమని చెప్పాడు. దీంతో ఇప్పటి వరకూ ఇంకా ఏ ఆఫర్ కు కమిట్ కావాలా అని కన్ఫ్యూజన్ లో ఉన్న అజయ్ ని ధనుష్ కాల్ మరింత కన్ఫ్యూజన్ లో పడేసిందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ దర్శకుడు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ ఓ లుక్ వేద్దామని ఈ రెండు రోజుల్లో చెన్నై వెళుతున్నాడు. ధనుష్ ను కలుస్తున్నాడు. ఆ తర్వాతే తెలుగులో సినిమా చేయాలా, ధనుష్ తో చేయాలా అని నిర్ణయించుకుంటాడట. 

ఇక ధనుష్ ఆఫర్ లో మరో బంపర్ ఆఫర్ ఏంటంటే.. అజయ్ చెప్పే కథ అతనికి నచ్చితే.. ఇది మల్టీ లింగ్వుల్ గా చేస్తా అన్నాడట. అంతే కాదు.. ఆ సినిమాను తనే నిర్మిస్తానని హామీ ఇచ్చాడట. అంటే అజయ్ రొట్టె విరిగి కోలీవుడ్ లో పడ్డట్టే. సో ఇప్పటి వరకూ అజయ్ తెలుగులో ఎవరితో  చేస్తాడా అనే డౌట్ ప్లేస్ లో అసలు తెలుగులోనే చేస్తాడా అనే డౌట్ వరకూ వచ్చింది మేటర్. ఏదేమైనా టాలెంట్ ఉన్నోడికి టైమ్ పట్టొచ్చు.. కానీ టైమింగ్ కలిసొస్తే మాత్రం ఖచ్చితంగా టాప్ గేర్ లో దూసుకుపోతాడు. మరి అజయ్ భూపతి చెన్నై నుంచి ఏ వార్త తెస్తాడో చూడాలి. 

More Related Stories