English   

ధనుష్ హాలీవుడ్ సినిమా ఇప్పుడు తమిళ్ లోకి 

 Dhanush
2019-05-22 14:36:43

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన హాలీవుడ్ సినిమా 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' తమిళ్‌లో రిలీజ్ కావడానికి సిద్దం అవుతోంది. ఇక ఈ సినిమాని తమిళ్‌ లో 'పక్కిరి' అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. నిజానికి భారత్ కి చెందిన అనీల్ కపూర్, ప్రియాంక చోప్రా, దీపికా పడుకునే, ఓంపురి, సోనూ సూద్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వారు కొన్ని హాలీవుడ్ సినిమాల్లో నటించారు. అలాగే ధనుష్ కూడా ' ద ఎక్స్ టార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్' అనే సినిమాలో నటించారు. రొమైన్ ప్యూర్తొలా రాసిన 'ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్ హూ గాట్ ట్రాప్‌డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్‌రోబ్‌' పుస్త‌కం ఆధారంగా కెనడియన్‌ డైరెక‍్టర్‌ కెన్‌ స్కాట్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో హాలీవుడ్ హీరోయిన్లు ఉమా తుర్మన్, అలెగ్జాండ్రా దడారియోలతో ధ‌నుష్‌ సరసన నటించారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాని ధనుష్ క్రేజ్ రీత్యా తమిళ్ లో విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 21న దేశ వ్యాప్తంగా ఈ మూవీ విడుద‌ల కానుంది. ఈ మూవీలో ధనుష్, వీధిలో గారడీ చేసే వాడిగా నటించాడు.  

More Related Stories