English   

మంచు అభిమానులకు గుడ్ న్యూస్.. ఢీ సీక్వెల్ రాబోతుంది

manchu vishnu
2020-11-23 14:05:39

శ్రీనువైట్ల డైరెక్షన్ లో వచ్చి రికార్డులు బద్దలు కొట్టిన సినిమాల్లో మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన "ఢీ" సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో విష్ణు, బ్రహ్మానందం, దివంగత నటుడు జయప్రకాష్ నారాయణ్ మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. దాంతో ఈ సినిమా విష్ణు కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమా గా నిలిచింది. అంతే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద కూడా వసూళ్ల వర్షం కురిపించింది. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. 

ఇక తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా సీక్వెల్ తిస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచడం కోసం ఢీ అంటే ఢీ వస్తున్నామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఇక ఈ సినిమాకు మహతి సాగర్ స్వరాలను అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా శ్రీను వైట్ల ఇండస్ట్రీ లో హిట్లు లేక తిప్పలు పడుతున్నారు. మంచు విష్ణు కి సైతం ఢీ తరవాత అంత పెద్ద హిట్ లేదు. ఇక ఈ సారి కాంబినేషన్లో వస్తున్న ఢీ అంటే ఢీ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

More Related Stories