English   

అరె.. అర్జున్ రెడ్డి డబ్బులు వాళ్లకిచ్చాడే..?

Dhruv-Vikram
2018-09-25 13:30:42

లాస్ట్ ఇయర్ వచ్చిన బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ ఇంకా చాలామందికి దిగలేదు. ఆ రేంజ్ లో ఆడియన్స్ లోకి ఎక్కేసిందా సినిమా. విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ ను చేసింది కూడా ఈ సినిమానే. ఇప్పుడీ సినిమాలో నటించినందుకుగానూ వచ్చిన డబ్బులు దానం చేస్తున్నాడు యంగ్ స్టార్. అయితే చేస్తున్నది.. విజయ్ దేవరకొండ కాదు. ఈ మూవీ రీమేక్ లో నటిస్తోన్న ధృవ్ విక్రమ్. అదెలా అంటారా.. సింపుల్ అర్జున్ రెడ్డి తమిళ్ లో రీమేక్ తో ‘వర్మ’తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ధృవ్. స్టార్ హీరో విక్రమ్ తనయుడైన ధృవ్.. ఈ మూవీకోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ను కేరళ వరద బాదితులకు అందించాడు. తనే స్వయంగా కేరళ సిఎమ్ ను కలిసి మరీ ఈ డబ్బులు అందజేశాడు.

అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ కు ‘వర్మ’ అనే టైటిల్ కన్ఫార్మ్ చేశారు. రా అండ్ రియలిస్టిక్ మూవీస్ తీయడంలో ఎక్స్ పర్ట్ అయిన బాలా ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తుండటం విశేషం. మరో విశేషం ఏంటంటే.. విక్రమ్ స్టార్ హీరోగా ఎదిగింది కూడా బాలా చిత్రాలతోనే. అందుకే తనయుడిని ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయిస్తున్నాడు విక్రమ్. రీసెంట్ గా వర్మ టీజర్ విడుదలైంది. గడ్డం లేకుండా కుర్రాడు బానే ఉన్నా.. గడ్డం ఉంటే మాత్రం ‘మనకు’ కామెడీ పీస్ లా కనిపించాడనే టాక్ ఉంది. మొత్తంగా కుర్రాడు ఫస్ట్ మూవీతోనే ఓ బెస్ట్ డైరెక్టర్ అండ్ స్క్రిప్ట్ చేతిలో పడ్డాడు. మరి బాలా ఈ సినిమాను ఎలా డైరెక్ట్ చేశాడనేది చూడాలి. 

More Related Stories