English   

తమిళ అర్జున్ రెడ్డి ట్రైలర్ తో వచ్చాడు !

Dhruv-Vikram
2019-01-09 11:51:21

తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా తెరకెక్కించిన 'అర్జున్ రెడ్డి' గుర్తుండే ఉంటుంది. వీరిద్దరినీ ఆ సినిమా వారిని ఓవర్ నైట్ స్టార్స్ ని చేసింది. దీంతో ఇప్పుడు ‘అర్జున్‌ రెడ్డి’ పలు భాషల్లోకి రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ లో సందీప్‌ వంగా డైరెక్షన్‌ లో షాహిద్‌ కపూర్‌ హీరోగా 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేస్తుండగా, తమిళంలో 'వర్మ' పేరుతో రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సూర్య చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.

ఈ ట్రైలర్ చూస్తుంటే డైరెక్టర్‌ బాలా ఈ రీమేక్‌ను తమిళ నేటీవిటికి తగ్గట్టుగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. హీరో లైఫ్ లోని వివిధ స్టేజ్ లకి సంబంధించిన సీన్లతో ఈ ట్రైలర్ ను కట్ చేశారు. రొమాన్స్, ఎమోషన్ కి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నస్ ఈ ట్రైలర్ ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. ఇక లుక్ పరంగా కూడా విజయ్ దేవరకొండ లానే ధృవ్ కూడా కనిపిస్తున్నాడు. కానీ తెలుగులో సాదా సీదాగా అయిపోయిన పని మనిషి ఎపిసోడ్ తమిళ్ లో కాస్త మార్చినట్టు ఉన్నారు. సీనియర్ నటి ఈశ్వరీ రావు ఆ పాత్ర పోషిస్తున్నట్టు ట్రైలర్ బట్టి అర్ధం అవుతుంది. ఇక మొత్తంగా ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచుతుందనే చెప్పాలి, త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తమిళంలోను ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనీ, ధృవ్‌ని కూడా ఓవర్‌నైట్‌ స్టార్‌ చేస్తుందని భావిస్తున్నారు మేకర్స్. ఎంతవరకు నిజమవుతుందో లేదో చూడాలి. 

More Related Stories