English   

ఎన్టీఆర్ లుక్ పిచ్చెక్కించాడుగా.

Jrntr diet

సినిమా సినిమాకు క‌థ విష‌యంలోనే కాదు.. లుక్ విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఈయ‌న మూడేళ్లుగా పూర్తిగా మారిపోయాడు. ఒక‌ప్ప‌టి ఎన్టీఆర్ కాదిప్పుడు. ఈయ‌న‌లో కూడా చాలా అంటే చాలా మార్పులొచ్చాయి. రొటీన్ క‌థ‌ల వైపు క‌నీసం చూడ‌ట్లేదు జూనియ‌ర్. సినిమా కోసం ప్రాణం పెట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. దాంతో ద‌ర్శ‌కులు కూడా ఎన్టీఆర్ ను మోసం చేయ‌డానికి చూడ‌ట్లేదు. వాళ్లు కూడా చాలా సిన్సియ‌ర్ గా ఏం కావాలో అడుగుతున్నారు. ఇప్పుడు ఈయ‌న త్రివిక్ర‌మ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చ్ లో మొద‌లు కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. దాంతో ఈ పాత్ర కోసం ఫుల్ డైట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలో క‌నిపించ‌నంత ఫ్రెష్ లుక్ ఇందులో ఉండ‌బోతుంది. ఇప్ప‌టికే చాలా మారిపోయాడు ఎన్టీఆర్. తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన ఫోటో ఒక‌టి ఇప్పుడు ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేయిస్తుంది.

కెరీర్ కొత్త‌లో ఎన్టీఆర్ ఎలా ఉండేవాడో ఒక్క‌సారి ఊహించుకోండి. సున్నుండ ఉంట‌ది క‌దా.. చూడ్డానికి బొద్దుగా ముద్దుగా ఉండేవాడు జూనియ‌ర్. అందుకే ఆదిలో సున్నుండ తీసుకో అంటూ పాట కూడా పెట్టాడు వినాయ‌క్. రాఖీ టైమ్ వ‌చ్చేస‌రికి చూడ్డానికి కూడా ఇబ్బందిగా అనిపించేంత బ‌రువు పెరిగిపోయాడు ఎన్టీఆర్. అది చూసిన త‌ర్వాతే ఎన్టీఆర్ తో చెమ‌ట‌లు క‌క్కించి మ‌రీ య‌మ‌దొంగ‌లో స్లిమ్ చేయించాడు రాజ‌మౌళి. అది మొద‌లు ఇప్ప‌టి వ‌ర‌కు లావెక్క‌లేదు ఎన్టీఆర్. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఊస‌ర‌వెల్లి, జ‌న‌తా గ్యారేజ్ లో కాస్త ఒళ్లు చేసిన‌ట్లు క‌నిపించినా.. పాత రూపంలోకి అయితే మార‌లేదు. కానీ సీన్ చూస్తుంటే.. ఆ సీన్ త్వ‌ర‌లోనే వ‌చ్చేలా క‌నిపిస్తోంది. మొన్న జై ల‌వ‌కుశ‌లో కూడా కాస్త బొద్దుగా క‌నిపించాడు. ఇప్పుడు మ‌ళ్లీ ఆ కొవ్వు క‌రిగించే ప‌నిలో ఉన్నాడు ఈ హీరో.

More Related Stories