English   

దిశా, టైగ‌ర్.. ఆ రెస్టారెంట్ లో..!!

tiger shorff
2018-07-23 10:25:08

బాలీవుడ్ లో ఇప్పుడు ఈ ఇద్ద‌రి గురించి ఇలాగే మాట్లాడుకుంటున్నారు మ‌రి. వీళ్లు చేస్తోన్న ప‌నులు కూడా ఇలాగే ఉన్నాయి. ఇద్ద‌రూ ఎక్క‌డ ప‌డితే అక్క‌డ తిరిగేస్తున్నారు. ఏ వేడుకలో చూసినా.. ఏ ఈవెంట్ లో చూసినా ఇద్ద‌రూ జంట‌గానే క‌నిపిస్తున్నారు కానీ విడిపోవ‌ట్లేదు. ఈ జోడీని ఇలా చూస్తుంటే ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలు కూడా క్లియ‌ర్ అయిపోతున్నాయి. టైగ‌ర్ ష్రాఫ్, దిశాప‌టానీ మ‌ధ్య‌లో కుచ్ కుచ్ హోతా హై అంటూ చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే ఇద్ద‌రూ వాటిని ప‌ట్టించుకోకుండా తాము చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ జోడీ ముంబైలోని ఓ రెస్టారెంట్ లో క‌నిపించారు. ఈ ఇద్ద‌రూ డిన్న‌ర్ డేట్ కు వెళ్లారు. బ‌య‌టికి వ‌స్తుండ‌గా ఫోటోల‌కు చిక్కారు. టైగ‌ర్.. దిశా తీరు చూస్తుంటే ఎలాగూ తెలిసిందిగా పండ‌గ చేసుకోండి అన్న‌ట్లు ఫోజులిస్తున్న‌ట్లే ఉంది. మీడియా ఉన్నా కూడా సింపుల్ గా వాళ్ల‌కు హాయ్ చెబుతూ అక్క‌డ్నుంచి వెళ్లిపోతున్నారు. ఈ మ‌ధ్య బాలీవుడ్ ప్రేమ‌ల‌న్నీ పెళ్లి వ‌ర‌కు వ‌స్తున్నాయి.. మ‌రి ఈ ప్రేమ ఎక్క‌డివ‌ర‌కు వ‌స్తుందో..? 

More Related Stories