English   

రాజుగారు కాలాను ఏం చేస్తారో..?

dil raj kaala

అస‌లే ఈ మ‌ధ్య దిల్ రాజు గారి టైమ్ బాగోలేదు. అదేంటి.. వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న నిర్మాత‌ను ప‌ట్టుకుని అంత మాట‌నేసారు అనుకుంటున్నారా..? ఈయ‌న టైమ్ నిర్మాత‌గా బాగానే ఉంది కానీ డిస్ట్రిబ్యూట‌ర్ గా మాత్రం నీర‌సంగా సాగుతుంది. ఈ మ‌ధ్యే రాజు విడుద‌ల చేసిన ఏ సినిమా కూడా పెద్ద‌గా ఆడ‌లేదు. మొన్న‌టికి మొన్న అద్భుతంగా ఉంటుంద‌ని చెప్పి విడుద‌ల చేసిన మెహ‌బూబా ముచ్చ‌ట‌గా మూడు రోజులు కూడా ఆడ‌లేదు. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు ఇలాగే పోయాయి. అజ్ఞాత‌వాసి సైతం రాజుగారి సినిమానే. ఇప్పుడు ఈయ‌న కాలాను నైజాంలో విడుద‌ల చేస్తున్నాడు. ర‌జినీకాంత్ సినిమాల్లో న‌ర‌సింహా త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడే రాజుగారు విడుద‌ల చేస్తున్నారు. అది బ్లాక్ బ‌స్ట‌ర్.. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు కాలాతో వ‌స్తున్నారు. ముందు ఈ చిత్రాన్ని నైజాంలో కూడా లైకా సంస్థే సొంతంగా విడుద‌ల చేస్తుంద‌ని అనుకున్నా కూడా చివ‌రి నిమిషంలో దిల్ రాజు ఎంట‌ర్ అయ్యాడు. చాలా త‌క్కువ రేట్ కే కాలాను సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. క‌బాలి నిరాశ ప‌రిచిన నేప‌థ్యంలో కాలా ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుందో..? 

More Related Stories