English   

హిందీలోనూ పాగా వేస్తున్న నిర్మాత దిల్ రాజు..

dil raju
2020-05-28 07:02:00

దిల్ రాజు అంటే ఇప్పటి వరకు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. కానీ ఈయన ఇప్పుడు హిందీలోకి కూడా అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే అక్కడ జెర్సీ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ తో కలిసి నిర్మిస్తున్నాడు దిల్ రాజు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు రెండో ప్రయత్నంగా మరోసారి నాని సినిమానే తీసుకెళ్తున్నాడు దిల్ రాజు. ఈ సారి నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన హిట్ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నాడు దిల్ రాజు. విభిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించింది. కరోనాకు ముందు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో మాత్రమే కాకుండా డిజిటల్ గా కూడా హిట్ అయ్యింది.

పేరుకు తగ్గట్లుగానే హిట్ కొట్టి నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చింది. పాటలు, ఫైట్లు, కామెడీ లేకుండా కేవలం కథాపరంగానే హిట్ సినిమా వచ్చింది. శైలేష్ కోనేరు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఒక్క హత్య కేసు ఇన్వెస్టిగేషన్ తోనే సినిమా అంతా నడుస్తుంది. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నాడు నిర్మాత దిల్ రాజు. అక్కడ ఓ స్టార్ హీరోతో ఈ సినిమా రీమేక్ చేయాలని దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు. బాలీవుడ్ లో కూడా మీడియం బడ్జెట్ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. ఇప్పటి వరకు తెలుగు నుంచి వెళ్లి రామానాయుడు మాత్రమే హిందీలో పాగా వేసాడు. అక్కడ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు దిల్ రాజు కూడా అదే దారిలో వెళ్తున్నాడు. ఇక తెలుగులో వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు దిల్ రాజు.

 

More Related Stories