English   

ఫ్యాన్సీ రేటుకు బాలయ్య బీబీ 3 ని సొంతం చేసుకున్న దిల్ రాజు

dil raju
2021-02-22 18:24:36

నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా బీబీ3. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో ఈ సినిమాపై పై కూడా అటు అభిమానుల్లో..ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతవరకు ఈ సినిమా షూటింగ్ పూర్తయిట్టు సమాచారం. ఇక ఇప్పటికే సినిమా విడుదల తేదీని కూడా చిత్ర యూనిట్ ప్రకటించేసింది. సినిమాను మే 28న విడుదల చేయబోతునట్టు స్పష్టం చేసింది. ఇక బాలయ్య బోయపాటి కాంబిబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు తగ్గట్టుగా థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్ లు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రాంత థియేట్రికల్ రైట్స్ ను రూ.35 కోట్లకు అమ్మీదయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్ ను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ పై క్రేజ్ తోనే ఈ రేంజ్ లో అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.

More Related Stories