English   

దిల్ రాజు సరికొత్త రికార్డ్ 

dil raju

దిల్ రాజు ఇప్పటి వరకూ తెలుగు సినిమా హిస్ట్రీలో ఎవరూ చేయనంత పనిచేశాడు. ఒక రకంగా డేర్ చేశాడు. డేట్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన బ్యానర్ లో వస్తోన్న సినిమాలు పెద్దగా సక్సస్ అవడం లేదు. అయినా కంటిన్యూస్ గా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి లవర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో నాలుగు సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. మరి ఇంత సడెన్ గా ఎందుకు చేశాడో కానీ.. ఇప్పుడీ ఐదు సినిమాల రిలీజ్ డేట్స్ ఒకేసారి అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు.రాజ్ తరుణ్ హీరోగా నటించిన లవర్ సినిమా ఈ నెల 20న వస్తోంది. ఇది ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇక నితిన్, రాశిఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శ్రీనివాస కళ్యాణం’ డేట్ కూడా అనౌన్స్ చేశాడు. ముందు నుంచీ చెబుతున్నట్టే ఈ సినిమాను ఆగస్ట్ 9న డిక్లేర్ చేశాడు. 

ఇక తన బ్యానర్ లో ఫస్ట్ టైమ్ నటిస్తోన్న రామ్ హీరోగా వస్తోన్న సినిమా హాలోగురూ ప్రేమకోసమే అక్టోబర్ 18న దసరా కానుకగా విడుదల చేస్తున్నాడు. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ నటిస్తోంది. ఆశ్చర్యం ఏంటంటే. అంతకు ముందు వారమే  అంటే అక్టోబర్ 11న యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న అరవింద సమేత వీరరాఘవ విడుదలవుతోంది. అంటే వారం తర్వాత తన సినిమాను ఎన్టీఆర్ కు పోటీగా వేస్తున్నాడు.

ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందుతోన్న మల్టీస్టారర్ ఎఫ్2 ను ఏకంగా సంక్రాంతి బరిలో నిలిపాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న సినిమా ఇది. తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈసినిమాను వచ్చే యేడాది జనవరి 12న విడుదల చేస్తున్నా అని ప్రకటించాడు. వీటి తర్వాత మరో నిర్మాతతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న మహేష్ బాబు సినిమాకు ఆల్రెడీ డేట్ ఇచ్చాడు. అయినా అదే డేట్ ను డిక్లేర్ చేస్తూ ఈ నాలుగు సినిమాలతో పాటు ప్రకటించాడు. మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. మొత్తంగా ఒకేసారి ఐదు సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి దిల్ రాజు సరికొత్త సెన్షేషన్ క్రియేట్ చేశాడు.. 

More Related Stories