English   

దిల్ రాజు ‘ఓవర్’కష్టాలు

dil raju
2018-07-15 12:30:30

ఒకప్పుడు ప్రామినెంట్ ప్రొడ్యూసర్ గా తిరుగులేని ఆధిపత్యం చూపించిన దిల్ రాజు ఈ మధ్య బాగా డల్ అయ్యాడు. నిర్మించిన సినిమాలు ఆడక.. డిస్ట్రిబ్యూటర్ గానూ నష్టాలు చూస్తూ చాలా వరకూ లాసుల్లోనే ఉన్నాడని చాలాకాలంగా ఇండస్ట్రీ అంతా చెప్పుకుంటోంది. మరోవైపు అప్పుల భారమూ బాగా పెరిగింది అనేవాళ్లూ ఉన్నారు. అవన్నీ ఎలా ఉన్నా.. ఇప్పుడు దిల్ రాజు కష్టాల్లో ఉన్న మట వాస్తవం అంటోంది టాలీవుడ్. అవి ఆర్థిక కష్టాలు కాదు. తన సినిమాలు విడుదల చేయడానికి పడే బాధలు. దిల్ రాజు లాంటి వ్యక్తికి రిలీజ్ ప్రాబ్లమేం ఉంటుంది అనుకోకండి. ఉంటుంది. కాకపోతే ఇక్కడ కాదు.. ఓవర్శీస్ లో.

యస్.. ఓవర్శీస్ లో దిల్ రాజు సినిమాకు కాస్త మంచి మార్కెట్టే ఉంటుంది. కాకపోతే అది ఈమధ్య దెబ్బతింది. దీంతో అతని కొత్త సినిమాలకు బయ్యర్స్ ఎవరూ రావడం లేదు. వచ్చినా.. దిల్ రాజు చెబుతోన్న ఫిగర్ కు వాళ్లంతా నో చెబుతున్నారు.యస్.. ఈ నెల 20న విడుదల కాబోతోన్న రాజ్ తరుణ్ లవర్ సినిమాకు ఓవర్శీస్ లో బయ్యర్సే లేరు. ఇదే కాదు..కాస్త బెటర్ స్టార్స్ ఉన్న సినిమాలకూ దిల్ రాజు సినిమాలంటే అక్కడ నోచెబుతున్నారనే టాక్ వినిపిస్తోంది. 

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కుతోన్న శర్వానంద్, సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తోన్న పడిపడి లేచె మనసు సినిమాను ఓవర్శీస్ లో పట్టించుకున్నవారు లేరు. శర్వా, సాయిపల్లవితో పాటు దర్శకుడు హను రాఘవపూడికి కూడా ఓవర్శీస్ లో కాస్త మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి. అయినా ఎవరూ రిలీజ్ చేయడానికి రాకవపోడానికి కారణం దిల్ రాజు. ఇక ఇదే బ్యానర్ లో వస్తోన్న రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా వస్తోన్న  హలో గురూ ప్రేమకోసమే దీ ఇదే పరిస్థితి. ఈ రెండు సినిమాలకు కూడా ఓవర్శీస్ లో డిస్ట్రిబ్యూటర్స్ రాకపోవడానికి కారణం దిల్ రాజు చెబుతోన్న రేట్లే అంటున్నారు. అవును.. ఏమాత్రం పెద్ద మార్కెట్ లేని స్టార్స్ తో ఆయన తన బ్యానర్ పేరు చూపించి విపరీతమైన రేట్లు చెబుతున్నాడట. దీంతో ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో తనే అక్కడా విడుదల చేసేుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. మరి ఇదెంత వర్కవుట్ అవుతుందో కానీ.. దిల్ రాజు చేస్తోంది రిస్క్ అని మాత్రం చెబుతున్నారు.

More Related Stories