English   

దిల్ రాజుది అహంకారమా..? అనాలోచితమా..?

dil raju
2018-07-24 15:40:01

ఈ టైటిల్  కాస్త కటువుగా ఉన్నా.. వాస్తవం మాత్రం అదే అంటున్నారు చాలామంది. అవును.. అతను అనాలోచితంగా మాట్లాడుతున్నాడా..? లేక కావాలనే అంటున్నాడా అనే విషయంలో చాలామందికి క్లారిటీ రావడం లేదు. కావాలని అంటే అది అహంకారం అనే అనుకోవాల్సి ఉంటుంది. అనాలోచితమైతే.. అంత పెద్ద  నిర్మాత అనాలోచితంగా ఓ పబ్లిక్ డయాస్ పై అలా ఎలా మాట్లాడతాడు అనాల్సి ఉంటుంది. అవును.. ఈ మధ్య దిల్ రాజు ప్రెస్ మీట్స్ కానీ.. వేడుకలు కానీ చూస్తే హీరోలను ఓ రేంజ్ లో డీ గ్రేడ్ చేస్తున్నాడు. రీసెంట్ గా రాజ్ తరుణ్ కెరీర్ కు ఆల్మోస్ట్ మంగళం పాడే లెవల్లో అతన్ని కించపరుస్తూ ఒకే ప్రెస్ మీట్ లో ఏకంగా ఓ పది మాటలైనా చెప్పి ఉంటాడు. అతనికి మార్కెట్ లేదనీ, రాజ్ తరుణ్ నమ్మి 8కోట్లు ఎవరూ పెట్టరని.. ఇంక అతని పని ఐపోయిన టైమ్ లో వస్తోన్న సినిమా లవర్ అనీ.. పాపం ఇలా ఏవోవే అనేశాడు. ఆ మాటలు వింటూ పైకి ఏమీ అనలేక.. లోపల అణచుకోలేక రాజ్ తరుణ్ నానా ఇబ్బందులు పడ్డాడు.. 

ఇక లేటెస్ట్ గా నితిన్ హీరోగా నటిస్తోన్న శ్రీనివాస కళ్యాణం ఆడయో ఫంక్షన్ లో కూడా ఇలాగే అనేశాడు. తనకు వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయని.. తనకో సినిమా చేయమని నితిన్ తన ఇంటికి వచ్చి అడిగాడనీ.. అందుకే ఈ సినిమా చేశానని చెప్పాడు. నిజానికి నితిన్ సినిమాతోనే ఈ బ్యానర్ నిలబడింది. అప్పుడు అతని క్రేజే రాజును దిల్ రాజును చేసింది. అవన్నీ మర్చిపోయి.. ఇప్పుడు రెండు మూడు ఫ్లాప్స్ వచ్చాయని నితిన్ లాంటి స్టార్ ను డీ గ్రేడ్ చేస్తూ ఇలా ఓ ఆడియో వేడుకలో చెప్పడం ఏమంత సమంజసంగా లేదని చాలామంది చెప్పుకుంటున్నారు. 

More Related Stories