English   

దిల్ రాజు ప్లానింగ్ కు స‌లాం..!

Dil-Raju
2018-07-19 13:47:51

ఏ నిర్మాత క‌నీసం క‌ల‌లో కూడా ఊహించ‌ని రికార్డును గ‌తేడాది సొంతం చేసుకున్నాడు దిల్ రాజు. ఒకే ఏడాది ఆరు సినిమాలు నిర్మించ‌డ‌మే కాదు.. అన్ని సినిమాలు దాదాపు విజ‌యం సాధించాయి. అందులో రెండు మాత్ర‌మే యావ‌రేజ్ గా ఆడితే.. మిగిలిన నాలుగు సినిమాలు సూప‌ర్ గా వ‌ర్క‌వుట్ అయ్యాయి. క‌లెక్ష‌న్లు కురిపించాయి. శ‌త‌మానం భ‌వ‌తి నుంచి మొద‌లుపెట్టి.. నేనులోక‌ల్.. డిజే.. ఫిదా.. రాజా ది గ్రేట్.. ఎంసిఏ వ‌ర‌కు అన్నీ వ‌సూళ్ల సునామీ సృష్టించాయి. ఇదే రికార్డ్ అనుకుంటే ఇప్పుడు 2018లోనూ ఇదే కంటిన్యూ చేస్తున్నాడు దిల్ రాజు. ఈ ఏడాది మూడు సినిమాల‌తో రానున్నాడు రాజు. 

ఇప్ప‌టి వ‌ర‌కు అయితే ఏ సినిమా ఈ ఏడాది విడుదల కాలేదు కానీ చాలా స్పీడ్ గా అన్నీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ జ‌రుపుకుంటున్నాయి. జులై 20న ల‌వ‌ర్ తో దిల్ రాజు కొత్త ఇన్నింగ్స్ మొద‌లు కానుంది. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించిన ఈ చిత్రం జులై 20న వ‌స్తుంది. ఇక ఆగ‌స్ట్ 9న నితిన్ శ్రీ‌నివాస క‌ళ్యాణం విడుద‌ల కానుంది. రాశీఖ‌న్నా ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఆగ‌స్ట్ 19న ఈ చిత్ర మోష‌న్ టీజ‌ర్ తో పాటు ఆడియో విడుద‌ల తేదీని కూడా అనౌన్స్ చేయ‌నున్నారు. 

ఇక అక్టోబ‌ర్ 18న రామ్ హ‌లో గురు ప్రేమ‌కోస‌మే విడుద‌ల కానుంది. త్రినాథ‌రావ్ న‌క్కిన తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ కు జోడీగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తుంది. రెండేళ్ల త‌ర్వాత తెలుగులో ప్ర‌ణీత కూడా ఇందులో న‌టిస్తుంది. ఇక 2019 జ‌న‌వ‌రి 12న అనిల్ రావిపూడి ఎఫ్ 2 విడుదల కానుంది. వ‌రుణ్ తేజ్, వెంక‌టేశ్ హీరోలుగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో మెహ్రీన్, త‌మ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక మ‌హేశ్ బాబు 25వ సినిమా ఎప్రిల్ 5, 2019న విడుద‌ల కానుంది. ఇలా రాబోయే 10 నెల‌ల్లో 5 సినిమాల విడుద‌ల తేదీలు క‌న్ఫ‌ర్మ్ చేసాడు దిల్ రాజు. 

More Related Stories